వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోం, బీహర్‌లో వరద బీభత్సం, 47 మంది మృతి

|
Google Oneindia TeluguNews

గౌహతి : భారీ వర్షాలు, వరదలతో అసోం, బీహర్ చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రజలతోపాటు మూగజీవాలు బిక్కుబిక్కుమంటున్నాయి. మరోవైపు వరదలతో మృతుల సంఖ్య 47కి చేరింది. మరోవైపు పంజాబ్, హర్యానాలో వర్షం కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీలో కూడా వర్షం కురిసింది. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలోని ఆరు జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

 Floods claim 47 lives in Assam and Bihar

వరదలు బీహర్‌లోని 16 జిల్లాలపై ప్రభావం చూపింది. 25.71 లక్షల ప్రజల వరద ప్రభావానికి గురయ్యారు. ఒక్క బీహర్‌లోని ఇప్పటివరకు 25 మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎగువన ఉన్న నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తోన్నాయని .. అక్కడ నదులు నిండి దిగువకు ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. బీహర్‌లో లక్ష మంది ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇటు అసోంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. 33 జిల్లాల్లో వరదనీరు పోటెత్తింది. రాష్ట్రలో 45 లక్షల మంది వరదనీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 17 మంది చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు.

90 శాతం కజిరంగ పార్క్ వరదనీటితో నిండిపోయింది. దీంతో మూగజీవాలు నిలువనీడ లేకుండా అల్లాడిపోతున్నాయి. బ్రహ్మపుత్ర నదీని అనుకొని పార్క్ ఉంది. దీంతో నది నిండుకుండలా మారి .. నీరు ఊబికిరావడంతో పార్క్ మొత్తం నీటితో నిండిపోయింది. మరోవైపు గౌహతి, ఉజాన్ బజార్, ఖార్గులీ, భారలముఖ్ ప్రాంతాలపై కూడా వర్ష, వరద ప్రభావం చూపింది.

English summary
Flood fury continued in Bihar and Assam on Tuesday with the death toll in the region mounting to 47, even as a red alert was sounded in Kerala after the weather office predicted extremely heavy rains in the state. Heavy rains continued to lash Punjab and Haryana in the north, while the national capital received light showers for the second consecutive day. An India Meteorological Department (IMD) bulletin said extremely heavy rains -- over 204 mm rains in 24 hours -- are likely in six districts of Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X