వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లల్లో కరోనాను ఫ్లూ షాట్స్ తగ్గిస్తాయా? ఎలా కాపాడుకోవాలి?: తాజా స్టడీలో తేలిన కీలక విషయాలివే

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. మరింత సమర్థవంతంగా పనిచేసే టీకాల కోసం ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి.

పిల్లల్లో కరోనాను దూరం చేసే వ్యాక్సిన్లు..

పిల్లల్లో కరోనాను దూరం చేసే వ్యాక్సిన్లు..

ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోందనే పరిశోధనలు జరుగుతున్నాయి. పిల్లలపై కరోనా మహమ్మారి ప్రభావం తక్కువగానే ఉంటున్నప్పటికీ.. తాజా జరిగిన పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. పిల్లలకు ఇచ్చే ఫ్లూ మందులు, టీకాలు కరోనావైరస్ నుంచి వారిని కాపాడతాయని తేలింది.

పిల్లలను ఫ్లూ వ్యాక్సిన్ కరోనా నుంచి కాపాడుతుందా?

పిల్లలను ఫ్లూ వ్యాక్సిన్ కరోనా నుంచి కాపాడుతుందా?

యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి-కొలంబియాకు చెందిన పలువురు అమెరికా శాస్త్రవేత్తలు కరోనా సోకిన పలువురు పిల్లలపై పరిశోధనలు చేశారు. అర్కన్సాస్ చిల్డ్రెన్స్ ఆస్పత్రిలో చేరిన 905 మంది కరోనా సోకిన పిల్లలకు వైద్యులు సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత 29 శాతానికిపైగా పిల్లల్లో కరోనా లక్షణాలు తగ్గిపోయాయి.

32 శాతం రోగనిరోధక శక్తి కూడా పెరిగినట్లు తేలింది. దీంతో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్.. కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థను పిల్లల్లో ఏర్పాటు చేసిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ స్టడీ కో-ఆథర్ డాక్టర్ అంజలి పత్వార్ధన్ మాట్లాడుతూ.. ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చిన పిల్లల్లో కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఏర్పడిందని చెప్పారు.

పిల్లల్లో సాధారణ కరోనా లక్షణాలు

పిల్లల్లో సాధారణ కరోనా లక్షణాలు

యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్ హెచ్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దల్లో ఉండే కరోనా లక్షణాలే పిల్లల్లో కూడా ఉంటాయి. దగ్గు, వాసన, రుచిని కోల్పోవడం లాంటి లక్షణాలుంటాయి. తీవ్ర జలుబు, గొంతునొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం లాంటి లక్షణాలుంటాయని తెలిపింది. గుండె, ఊపిరితిత్తులు, రక్త నాళాలు, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, బ్రెయిన్, చర్మ లేదా కళ్లు లాంటి అవయవాలపైనా కరోనా ప్రభావం ఉంటుందని పేర్కొంది.

పిల్లలను కోవిడ్ 19 నుంచి ఎలా కాపాడుకోవాలి?

పిల్లలను కోవిడ్ 19 నుంచి ఎలా కాపాడుకోవాలి?

పిల్లలకు కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మాస్కులు ధరించడం, ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాలకు దూరంగా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల కరోనాను వారి దరి చేరకుండా చేయొచ్చు. బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ వారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలి. కానీ, వాటి వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉండటం వల్ల వాటిని జాగ్రత్తగా వినియోగించాలి.

English summary
Covid-19 in children has remained a matter of great concern amongst scientists and medical professionals. While studies have shown that children are less susceptible to developing the virus, there is still no guarantee whether they're entirely protected from the same. That said, according to a recent study, it has been found that children who get their annual flu jabs are well protected from the symptoms of COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X