వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ ఆదర్శం: తాను అక్కడే ఉండి, ఓ పేద గర్భిణి ప్రసవం కోసం హెలికాప్టర్ పంపాడు

|
Google Oneindia TeluguNews

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బ్రిగేడ్(రిటైర్డ్) బీడీ మిశ్రా చేసిన ఓ పని అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఆదర్శం అంటే ఏమిటో నిరూపించారు. ప్రసవం నొప్పులతో బాధపడుతున్న ఓ పేద మహిళను తొలుత హెలికాప్టర్‌లో తరలించాలని చెప్పారు. తద్వారా తన మానవత్వాన్ని చాటుకున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ పట్టణంలో ఓ నిండు గర్భిణీ పురిటి నొప్పులతో బాదపడుతోంది. వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంది. అప్పుడే తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ నగరంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే 200 కిలో మీటర్ల దూరం ప్రయాణించాలి.

Fly Her First: Arunachal Pradesh Governors Gesture For Pregnant Woman

అది కొండ ప్రాంతం. రోడ్డు మార్గాన వెళ్తే దాదాపు పదిహేను గంటల సమయం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. అక్కడున్న వాళ్లు ఆందోళన చెందారు. అప్పుడే ఆకాశంలో హెలికాప్టర్ వచ్చి వారి ముందు ఆగింది. హెలికాప్టర్‌లో నిండి గర్బిణిని ఎక్కించి ఆసుబత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

గర్భిణికి సిజేరియన్ చేయాలన్నారు. ఇందుకోసం ఈటానగర్ వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే.. గవర్నర్‌కు వివరించారు. దీంతో గవర్నర్ వెంటనే మొదట ఆమెను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించాలని చెప్పాడు. గర్భిణీని, ఆమె భర్తను తొలుత హెలికాప్టర్‌లో పంపించి, ఆ తర్వాత అతను హెలికాప్టర్‌లో వెళ్లాడు.

English summary
In a humanitarian gesture, Arunachal Pradesh Governor Brig (Retd) B D Mishra took a woman, who was in urgent need of medical attention, in his helicopter from Tawang to a hospital, Raj Bhawan sources said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X