వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌కు వ‌రుస ప్ర‌మాదాలుః ఈ సారి రాళ్లు, అద్దాలు ధ్వంసం..కార‌ణం?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశంలోనే అత్యంత వేగంగా ప్ర‌యాణించే సామ‌ర్థ్యం ఉన్న వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌కు ప్ర‌మాదాలు వీడ‌ట్లేదు. ప‌ట్టాలెక్కిన‌ప్ప‌టి నుంచీ త‌ర‌చూ ఏదో ఒక ప్ర‌మాదానికి గుర‌వుతూనే ఉంది ఈ ఎక్స్‌ప్రెస్‌. గ‌రిష్ఠంగా 160 కిలోమీట‌ర్ల వేగంతో రాక‌పోక‌లు సాగించే ఈ రైలు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ప్ర‌మాదానికి గురైంది. ప‌ట్టాల ప‌క్క‌న ప‌రిచిన గుల‌క‌రాళ్లు త‌గిలి, లోకో పైలెట్ క్యాబిన్ విండ్ స్క్రీన్ పై ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. కిటికీల‌కు బిగించిన అద్దాలు ప‌గిలిపోయాయి. ఆ ముక్క‌లు ప్ర‌యాణికుల‌పై ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ నెల 15వ తేదీన న్యూఢిల్లీ స్టేష‌న్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అత్యంత నిరాడంబ‌రంగా ఈ రైలును ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అంత‌కుముందు రోజే పుల్వామాలో ఉగ్ర‌వాదుల దాడి చోటు చేసుకోవ‌డం, ఈ దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు అమ‌ర వీరులైన నేప‌థ్యంలో మోడీ.. ఎలాంటి ఆర్భాటాల‌కు పోకుండా సాదాసీదాగా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. 17వ తేదీ నుంచి ఈ రైలు ప్ర‌యాణికుల కోసం అందుబాటులోకి వ‌చ్చింది. న్యూఢిల్లీ నుంచి వార‌ణాశికి ఎనిమిది గంట‌ల్లో రాక‌పోక‌లు సాగించే సామ‌ర్థ్యం దీని సొంతం.

Flying ballast hits Vande Bharat Express, drivers screen, side windows damaged

ప‌ట్టాలెక్కిన త‌రువాత వారం రోజుల వ్య‌వ‌ధిలో మూడుసార్లు ఈ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదాల‌ను చ‌వి చూసింది. అవ‌న్నీ స్వ‌ల్ప‌మైన‌వే. ఆదివారం కూడా మ‌రోసారి ప్ర‌మాదానికి గురైంది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని అచ‌ల్డా వ‌ద్ద‌ ఈ రైలు ఢిల్లీ వైపు ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో.. ఢిల్లీ నుంచి అసోం వైపున‌కు వెళ్తున్న దిబ్రూగ‌ఢ్ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ ప‌క్క ట్రాక్‌పై ఎదురుగా వ‌చ్చింది. అదే స‌మ‌యంలో- దిబ్రూగ‌ఢ్ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ మూడు గేదెల‌ను ఢీ కొట్టింది. ప‌ట్టాల‌పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది.

ఫ‌లితంగా- ప‌ట్టాల వ‌ద్ద ప‌రిచిన గుల‌క రాళ్లు శ‌ర‌వేగంగా ఎగిరి వెళ్లి, ప‌క్క‌న మ‌రో ట్రాక్ పై వెళ్తున్న వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ పై ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో లోకో పైలెట్ క్యాబిన్ విండ్ స్క్రీన్‌పై ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. సీ4, సీ6, సీ7, సీ13 బోగీల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్ర‌మాదాన్ని ఉత్త‌ర రైల్వే ధృవీక‌రించింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కిటికీ అద్దాలు పగిలాయ‌ని, ప్ర‌యాణికుల‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని ఉత్త‌ర రైల్వే ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారి ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

English summary
Uttar Pradesh: A flying ballast hit Vande Bharat Express on Saturday, damaging some side windows and the main driver's screen of the semi-high speed train. Talking to ANI, Northern Railways CPRO said that a shower of ballast came flying towards Vande Bharat Express when a cattle was run over by Dibrugarh Rajdhani, which was crossing on the adjoining track. Northern Railways released a statement confirming the incident, saying the flying ballast hit the windscreen of the driver and one each side outer glasses of windows of coach numbers C4, C6, C7, C8, C13. It also hit two glass panes of C12, causing little damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X