వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌పై ఎన్నికల ముద్ర- తమిళనాడు, బెంగాల్‌, కేరళకు కొత్త రోడ్డు ప్రాజెక్టులు

|
Google Oneindia TeluguNews

ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపించింది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళకు పలు కొత్త రోడ్డు ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాలకు భారీగా లబ్ది చేకూరనుంది.

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన బడ్డెట్‌లో తమిళనాడులో కొత్తగా 3500 కోట్ల రోడ్‌ కారిడార్లను ప్రతిపాదించారు. బెంగాల్లో 675 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల కోసం రూ.95 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే కేరళలో 1100 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల కోసం రూ.65 వేల కోట్లు కేటాయించారు. అసోంలోనూ వచ్చే మూడేళ్లలో 1300 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు ఆర్దికమంత్రి తెలిపారు.

FM announced new road projects for poll bound states of TN, kerala, West bengal

త్వరలో ఎన్నికలు జరిగే రాష్టాల్లో ఒకటైన పశ్చిమబెంగాల్లో కోల్‌కతా నుంచి సిలిగురికి వెళ్లే ప్రధాన జాతీయ రహదారి అభివృద్ధి కోసం రూ.25 కోట్లను కేంద్రం కేటాయించింది. తమిళనాడు, కేరళ, అసోంలోనూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకూ ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల హామీలుగా ఇవి ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

English summary
Finance Minister Nirmala sitharaman has announced new road projects to poll bound states of tamilnadu, west bengal and kerala in today's union budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X