వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2020: బహీ ఖాతా: బిజీబిజీగా నిర్మలా సీతారామన్: తెలుగింటి కోడలి చేతిలో రెండోసారి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : Nirmala Sitharaman Arrives At Parliament With 'Bahi Khata'

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశాన్ని కల్పించే బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు నుంచే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ ఉదయం తన అధికారిక నివాసం నుంచి బయలుదేరిన ఆమె సరిగ్గా 9 గంటలకు తన కార్యాలయానికి చేరుకునారు. ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ అక్కడే నిర్మలా సీతారామన్‌ను కలుసుకున్నారు.

union budget 2020: పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటి? union budget 2020: పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటి?

రాష్ట్రపతి భవన్‌లో

బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన బహీ-ఖాతాను తీసుకుని, తన అధికారులతో బృందంతో కలిసి వేర్వేరు వాహనాల్లో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల గురించి వివరించారు. బడ్జెట్ ప్రతిపాదనల కాపీలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. మరి కాస్సేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశానికి నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

కేంద్ర కేబినెట్ భేటీలో..

కేంద్ర కేబినెట్ భేటీలో..

బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలపై కేంద్ర కేబినెట్ చర్చిస్తుందని తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న మందగమనాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలను చేపట్టారనే విషయాన్ని నిర్మలా సీతారామన్.. మంత్రివర్గ సహచరులకు క్లుప్తంగా వివరించే అవకాశాలు ఉన్నాయి. రైల్వే, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలు, ఆరోపణలను ధీటుగా ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశంపైనా ప్రధానమంత్రి.. తన మంత్రివర్గ సహచరులకు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు ఆరంభమౌతాయి.

వరుసగా రెండోసారి..

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది జులైలో ఆమె మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అది మధ్యంతర బడ్జెట్. ఎన్నికలు ముగిసిన తరువాత ఏర్పడిన కొత్త మంత్రివర్గంలో నిర్మలా సీతారామన్‌కు ప్రతిష్ఠాత్మక ఆర్థిక మంత్రిత్వ శాఖ లభించింది. ఇదిలావుండగా.. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై అంచనాలు కాస్త భారీగానే ఉన్నాయి.

ఆర్థిక రంగానికి మరమ్మతులు తప్పకపోవచ్చంటూ..


వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 నుంచి 6.5 శాతం వరకు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వేలో స్పష్టం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని అందుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది మరి కాస్సేపట్లో తేలిపోనుంది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని నివారించడానికి ఎలాంటి మరమ్మతులు చేస్తారనే ఆసక్తి ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొని ఉంది.

English summary
Delhi: Finance Minister Nirmala Sitharaman with 'Bahi-Khata' ahead of presentation of Union Budget 2020-21.Cabinet meeting to be held at 10:15 am today in the Parliament House, ahead of the presentation of Union Budget..Nirmala Sitharaman and her team to meet President Ram Nath Kovind, ahead of presentation of Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X