వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2020: సబ్ కా సాథ్..సబ్ కా వికాస్: బడ్జెట్ స్థూల సందేశం ఇదే: నిర్మలా సీతారామన్.. !

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : 16 Point Plan for Farmers to Revive The Farm And Agriculture Sector

న్యూఢిల్లీ: సమాజంలో అన్ని రంగాల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్..అనే నినాదాన్ని ఆధారంగా చేసుకున్నామని అన్నారు. దేశం పురోగిమించడానికి సంక్షేమం, అభివృద్ధి అనేవి అత్యవసరమని, వాటిని దృష్టిలో ఉంచుకున్నామని చెప్పారు. గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పన, విద్యా, వైద్యం, వ్యవసాయం, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగం.. ఇలా అన్ని రంగాలకూ ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని హామీ ఇచ్చారు.

Union Budget 2020: బహీ ఖాతా: బిజీబిజీగా నిర్మలా సీతారామన్: తెలుగింటి కోడలిలో చేతిలో రెండోసారి!Union Budget 2020: బహీ ఖాతా: బిజీబిజీగా నిర్మలా సీతారామన్: తెలుగింటి కోడలిలో చేతిలో రెండోసారి!

అరుణ్ జైట్లీకి నివాళి..

అరుణ్ జైట్లీకి నివాళి..

2020-2021 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను నిర్మలా సీతారామన్.. శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని ఆరంభించారు. అంతకుముందు- కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి దివంగత అరుణ్ జైట్లీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా- ఆమె బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని సభకు వివరించారు.

సామాన్యుల బడ్జెట్‌గా అభివర్ణన..

సామాన్యుల బడ్జెట్‌గా అభివర్ణన..

ఇది సామాన్యల బడ్జెట్ అని, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నామని చెప్పారు. అదే సమయంలో- పారిశ్రామిక రంగానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి కావాల్సిన అన్ని అవసరాలను మదిలో ఉంచుకున్నామని అన్నారు. ఆర్థిక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఉంటుందని భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న వస్తు, సేవా పన్నుల (జీఎస్టీ) వసూళ్లను ఏ విధంగా పెంచాలనే అంశాన్ని బడ్జెట్ ప్రతిపాదనల్లో చర్చించినట్లు తెలిపారు.

జీఎస్టీ వసూళ్లు మెరుగు..

జీఎస్టీ వసూళ్లు మెరుగు..

ఇదివరకు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే.. ఈ సారి జీఎస్టీ వసూళ్లు మెరుగు పడ్డాయని అన్నారు. జీఎస్టీ వసూళ్లు పెరగడం.. శుభసూచకమని నిర్మలా సీతారామన్ చెప్పారు. తాము అమలు చేస్తోన్న జీఎస్టీ విధానం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లబ్ది పొందాయని అన్నారు. ఈ సారి కొత్తగా 16 లక్షల మందిని కొత్తగా పన్ను చెల్లింపుదారులుగా గుర్తించామని తెలిపారు. పలితంగా- దేశ రాబడి పెరుగుతుందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..

వ్యవసాయ రంగాన్ని మరింత ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. దీనికోసం అవసరమైన రాయితీలను ప్రకటించాలనే విషయాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించామని అన్నారు. పాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాటి మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలను చేపట్టామని తెలిపారు.

English summary
GST has resulted in efficiency gains in the transport and logistics sector, inspector raj has vanished, it has benefitted Micro, Small & Medium Enterprises(MSME). Consumers have got an annual benefit of 1 lakh crore rupees by GST, says Finance Minister Nirmala Sitharaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X