వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 11% -‘V’ షేప్‌లో -లోక్‌సభలో ఆర్థిక సర్వే 2020-21 -ప్రవేశపెట్టిన నిర్మల

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని, 'V' ఆకారంలో పైపైకి వెళతామని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే 2020-21ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.

బడ్జెట్ సమావేశాల తొలిరోజే రచ్చ -రాష్ట్రపతి ప్రసంగం మధ్యలో ఆర్ఎల్‌పీ ఎంపీ హల్‌చల్ -మార్షల్స్ ఎంట్రీబడ్జెట్ సమావేశాల తొలిరోజే రచ్చ -రాష్ట్రపతి ప్రసంగం మధ్యలో ఆర్ఎల్‌పీ ఎంపీ హల్‌చల్ -మార్షల్స్ ఎంట్రీ

బ‌డ్జెట్ స‌మావేశాల మొదటిరోజైన శుక్రవారం రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ ప్ర‌సంగం త‌ర్వాత లోక్‌స‌భ స‌మావేశ‌మైంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఎంపీల‌కు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంత‌రం సభ జరుగుతోన్న సమయంలో విప‌క్ష ఎంపీలు.. వ్యవసాయ చట్టాలపై చర్చను కోరుతూ ఆందోళనకు దిగాయి. విప‌క్ష స‌భ్యుల నినాదాల మ‌ధ్యే కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ .. ఎక‌నామిక్ స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టారు.

FM Nirmala tables Economic Survey 2021,‘V-shaped’ recovery, FY22 growth at 11%

మొత్తం రెండు భాగాల్లో ఆర్థిక స‌ర్వే కాపీల‌ను ప్ర‌చురించారు. 2021-22లో జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుంద‌ని ఎక‌నామిక్ స‌ర్వే అంచ‌నా వేసింది. అయితే, జీడీపీ మాత్రం ఓ మోస్తరుగా ఉంటుందని సర్వేలో పేర్కొన్నారు. అదే సమయంలో సమయంలో ద్రవ్యోల్బణం 15.4 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. స్వాతంత్ర్యం తర్వాత ఇదే అత్యధిక ద్రవ్యోల్బణమని పేర్కొన్నారు. కాగా, 'V ఆకార (వేగంగా పడి, వేగంగా లేచిన)' అభివృద్ధిని చోటుచేసుకుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

తప్పుడు ట్వీట్.. చిక్కుల్లో జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ -2వారాలపాటు ఆఫ్ ఎయిర్, జీతం కట్!తప్పుడు ట్వీట్.. చిక్కుల్లో జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ -2వారాలపాటు ఆఫ్ ఎయిర్, జీతం కట్!

కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ అని తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మల ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా విప‌క్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగా, స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌ళ్లీ స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. అదే రోజు నిర్మల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

English summary
Finance Minister Nirmala Sitharaman on Friday tabled the Economic Survey 2020-21 in the Parliament amid Opposition uproar during the Budget session. The survey has forecast the real GDP to grow 11 per cent in 2021-22. It also projected the country’s GDP to contract 7.7 per cent in the current fiscal year ending March 31, as economic activity was hit hard by the Covid-19 pandemic. It led to millions of job losses and small businesses were worst affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X