వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ దాణా కుంభకోణం మూడో కేసులో నేడే తీర్పు

ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌కు సంబంధించిన మూడో దాణా కుంభకోణం కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇప్పటికే లాలూ, జగన్నాథ మిశ్రా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రాంచీ: ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌కు సంబంధించిన మూడో దాణా కుంభకోణం కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇప్పటికే లాలూ, జగన్నాథ మిశ్రా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసుకు సంబంధించి రాంచీలోని ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్‌ఎస్‌.ప్రసాద్‌ బుధవారం తీర్పునివ్వనున్నారు. ఇప్పటికే లాలూ రెండో దాణా కుంభకోణం కేసులో మూడేన్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు.

bihar-lalu

మూడో దాణా కుంభకోణం కేసులో ఛాయ్‌బసా ఖజానా నుంచి రూ.36కోట్లు అక్రమంగా పొందినట్లు లాలూ, మిశ్రాపై కేసు ఉంది. దీనికి సంబంధించిన తీర్పునే బుధవారం వెలువరించనున్నారు.

లాలూపై మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసులు ఉన్నాయి. 2013లో మొదటి దాణా కుంభకోణం కేసులో లాలూ అయిదేళ్ల జైలు శిక్ష పడింది. మరో కేసులో ఈనెల 6న లాలూకి మూడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ఇంకా ఆయనపై దమ్‌కా ఖజానా నుంచి రూ.3.97కోట్లు, దొరాండా ఖజానా ద్వారా రూ.184కోట్లు అక్రమంగా పొందినట్లు కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించిన తీర్పులు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి.

English summary
A special CBI court will on Wednesday pronounce judgment in a fodder scam case in which two former Chief Ministers of Bihar - Lalu Prasad and Jagannth Mishra - are accused. Special court judge SS Prasad will deliver judgment in the case, which is related to fraudulent withdrawal of Rs 33.67 crore from Chaibasa treasury in 1992-1993. The allegation is that Rs 33.67 crore was withdrawn on fake allotment letters. The actual sanction of amount was Rs 7.10 lakh. In all there are 56 accused, including former Chief Secretary of Jharkhand Sajal Chakraborty. Sajjal was Deputy Commissioner of West Singhbhum district when the alleged fraudulent withdrawal had taken place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X