వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ అంటే ఒక శక్తి, విధానాలు అనుసరణీయం, దేవుడిగా కొలవడం కాదు, నితీశ్

|
Google Oneindia TeluguNews

మహాత్మాగాంధీ విధానాలు ఆచరించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. కానీ గాంధీని ఆరాధించి దేవుడుని చేయొద్దని కోరారు. వాస్తవానికి ఇది గాంధీకి కూడా నచ్చదని చెప్పారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా 'గాంధీ విచార్ సమగం' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ జీ అంటే ఏంటో కూడా వారికి తెలియదని విమర్శించారు. వారికి తెలిసిందల్లా సోషల్ మీడియా ఒక్కటేనని ధ్వజమెత్తారు.

రసగుల్లా మాత్రం తప్పకుండా తీసుకొచ్చేవారు.. జైట్లీతో అనుబంధాన్ని గుర్తుచేసుకొన్న నితీశ్రసగుల్లా మాత్రం తప్పకుండా తీసుకొచ్చేవారు.. జైట్లీతో అనుబంధాన్ని గుర్తుచేసుకొన్న నితీశ్

ప్రస్తుతం సమాజ పోకడ మారిందని నితీశ్ కుమార్ అన్నారు. వాస్తవం ఏంటీ అని తెలుసుకోని పరిస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. యువతకు తెలిసింది ఒక్కటే సోషల్ మీడియా అని ఎద్దేవా చేశారు. దాంతో కాలం గడుపుతూ అదే నిజమని భ్రమలో ఉన్నారని తప్పుపడ్డారు. గాంధీ అంటే ఏంటో కూడా తెలియని స్థితిలో యువత ఉందని గుర్తుచేశారు.

Follow Mahatma Gandhis principles but dont make him an object of worship: Nitish

మహాత్మా గాంధీ అంటే జాతిపిత, దేవుడు అనే కొలుస్తున్నారు. కానీ అతను మానవ మాత్రుడే, స్వరాజ్యం కోసం పోరాడిన యోధుడనే విషయాన్ని గుర్తించలేకపోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీ వల్లెవేసిన కొన్ని నీతి సూక్తులను కూడా ప్రస్తావించారు. పని, జ్ఞానం, ప్రవర్తన, రాజకీయం, విలువలు అనే అంశాలు ప్రధానమని గాంధీ జీ చెప్పేవారని గుర్తుచేశారు. కానీ యువతరం మాత్రం సోషల్ మీడియాలో తమకు తెలిసిన గాంధీ వీరేనని భ్రమలో ఉన్నారని తెలిపారు.

English summary
bihar Chief Minister Nitish Kumar on Wednesday urged people to follow Gandhian principles in life but warned against deification of the Mahatma, saying it would lead to making him an object of worship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X