వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్

ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు.

బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్టీ నాయకత్వానికి రాజీనామా పంపినట్లు చెప్పారు.

<strong>బీఎంసీ ఎన్నికల ఫలితాలు: శివసేన, బీజేపీ హోరా హోరీ, ఎవరికి దక్కని మేజిక్ ఫిగర్</strong>బీఎంసీ ఎన్నికల ఫలితాలు: శివసేన, బీజేపీ హోరా హోరీ, ఎవరికి దక్కని మేజిక్ ఫిగర్

ఈ రోజు (గురువారం) ఫలితాలు వచ్చాయి. అయితే, ఎగ్జిట్ ఫోల్ మాత్రం బీజేపీ, శివసేన హవా ఉంటుందని తేల్చి చెప్పాయి. దీంతో తాను బుధవారం నాడే రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించానని చెప్పారు.

Following drubbing in BMC polls, Mumbai Congress chief Sanjay Nirupam offers to resign

అంతేకాదు, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని కూడా తాను అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి పైన చర్యలు తీసుకోకుంటే పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అయితే, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేశఆరో ఆయన చెప్పలేదు.

గత కార్పోరేషన్ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో తక్కువ సీట్లు గెలుచుకుంది.

ఈసారి జరిగిన ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బీజేపీ 84 సీట్లు, శివసేన 84 సీట్లు, కాంగ్రెస్ 32 సీట్లు, ఎంఎన్ఎస్ 8 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

English summary
Mumbai Congress chief Sanjay Nirupam has offered to resign from the post, accepting the responsibility for the setback party in the Brihanmumbai Municipal Corporation election. The party is unlikely to win even half of its existing tally of 52 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X