వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో పాలు, పప్పు వినియోగం తక్కువ: ఆకాశాన్నంటిన కందిపప్పు ధర, నివారణ చర్యలివే..?

|
Google Oneindia TeluguNews

పాలు, పప్పు దినుసులతో పోషక విలువలు ఎక్కువ. వైద్యులు కూడా వీటినే తీసుకోవాలని సూచిస్తుంటారు. ప్రొటిన్లు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండటమే కారణం. కానీ భారతదేశంలో పాలు, పప్పుల వినియోగం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని 2017-18లోనే జాతీయ గణాంక కార్యాలయం పేర్కొన్నది. దానిని ఇప్పుడు ఇతర సంస్థలు కూడా ధ‌ృవీకరిస్తున్నాయి. దేశంలో పాలు, పప్పు వినియోగం క్రమంగా తగ్గిపోతుందని విషయం ఆందోళన కలిగిస్తోంది.

అవును.. నిజమే..?

అవును.. నిజమే..?


ఇటీవల పుణెలో ‘గ్లోల్ పల్స్ కాన్లేవ్' జరిగింది. అందులో పాల్గొన్నవారు కూడా మనం తగినంత పప్పు ధాన్యాలు ఆహారం తీసుకోవడం లేదని తెలియజేశారు. పప్పు, శెనగలు, బఠానీ, మినప పప్పు, కందిపప్పు తదితర పప్పుల నిల్వ తగ్గిపోయిందని తెలిపారు. దేశీయంగా పప్పుల ఉత్తత్పి తగ్గడంతో దిగుమతిపై కూడా ప్రభావం చూపించిందని అంగీకరించారు. పంటలు కూడా తగ్గడంతో విదేశాలకు ఎగుమతి కూడా తగ్గుతోందని చెప్పారు. దీనిని బట్టి దేశంలో పప్పు ధాన్యాలను మరింత పండించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఎగుమతి చేయడమే గాక.. ప్రజలకు పోషక విలువుల అందుతాయని అంగీకరించారు.

క్రమంగా తగ్గుతూ..

క్రమంగా తగ్గుతూ..

2013-14, 2017-18 మధ్య పప్పు ధాన్యాల ఉత్పత్తి 18.6 మిలియన్ టన్నుల నుంచి 22.5 మిలియన్ టన్నులకు చేరింది. కానీ 2018-19లో మాత్రం అది 22.1 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఇలా ఏటేటా తగ్గుతూ వస్తోంది. దీంతో పప్పు ధాన్యాల వినియోగంలో ద్రవ్యోల్బణం వచ్చింది. దేశంలో పప్పు ధాన్యాల విక్రయాలు తగ్గాయని ఇండియన్ పల్స్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ ప్రతినిధి సౌరతభ్ భారతీయా అభిప్రాయపడ్డారు. అయితే తాము పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగేందుకు ఇదివరకు నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ అవలంభించిన విధానం అనుసరించాలని భావిస్తోన్నారు.

1980లో మాదిరిగా..

1980లో మాదిరిగా..

1980లో దేశంలో కోడిగుడ్ల వినియోగం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ.. ఎగ్ వినియోగించాలని, పోషక విలువలు బాగా ఉంటాయని ప్రచారం చేసింది. ఇప్పుడు పప్పు ధాన్యాల వినియోగించాలని కూడా అలాంటి ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పప్పుల ప్రోటిన్లు ఎక్కువగా ఉంటాయి, పీచు, కొలస్ట్రాల్ తక్కువతో కొవ్వు ఉండదని క్యాంపెన్ చేయాలని కోరారు. అయితే పప్పు ధాన్యాల ధర కూడా ఎక్కువవడం మరో కారణమని వ్యాపారి నితిన్ కలంత్రీ పేర్కొన్నారు. 2015-16లో కందిపప్పు కేజీ ధర రూ. 200కి చేరడం కారణమని వివరించారు.

Recommended Video

Viral Video : A Hunger Old Man Eating Washed Roti With Water, People Got Emotional | Oneindia Telugu
సంపన్నులే..

సంపన్నులే..

వాస్తవానికి ఆదాయం పెరిగే వర్గాలు మాత్రం పాలు, పప్పులు, గుడ్లు, మాంసం విరివిగా తీసుకుంటున్నారు. కానీ పేదలు మాత్రం ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం లేదు. జాతీయ గణాంక కార్యాలయం సర్వే పేదల కొనుగోలు శక్తి లేకపోవడంతోనే ప్రొటీన్లు తీసుకోవడం లేదని అర్థమవుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైతే.. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఉండదనే మరికొందరు వాదిస్తున్నారు.

English summary
stagnation in demand for pulses, milk and other protein-rich foods in India? The National Statistical Office (NSO) withheld its household consumption expenditure survey report for 2017-18 and others also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X