వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Food Delivery APP:నాలుగు నిమిషాల్లో 4 లక్షలు మాయం..ఈ కథేంటో చూడండి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Food Delivery App : Man Loses 4 lakh, Because Of A Food Delivery App ! || Oneindia Telugu

లక్నో: ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ యాప్‌తో కస్టమర్లు చాలా కోల్పోతున్నారు. తాము చేసిన ఆర్డర్ గురించి వాకాబు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తుండగా క్షణాల్లో కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం అవుతోంది. అయితే ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యాలు మాత్రం అది తమ తప్పు కాదని చెబుతున్నాయి. తాజాగా ఇలానే ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి భారీగా డబ్బులను పోగొట్టుకున్నాడు.

 తలనొప్పిగా మారిన టోల్ ఫ్రీ నెంబర్లు

తలనొప్పిగా మారిన టోల్ ఫ్రీ నెంబర్లు

నగరాల్లో ఫుడ్ డెలివరీ యాప్‌లకు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. వారికి కావాల్సిన ఆహారంను ఒక్క క్లిక్ ఇచ్చి డబ్బులు చెల్లించగానే డోరు ముందు ఆ ఫుడ్ డెలివరీ అవుతోంది. అన్నీ కాకపోయిన కొన్ని కస్టమర్ అనుకున్న సమయానికి ఆర్డర్ ఇచ్చిన ఆహారం చేరకపోవడంతో విసిగిపోతున్న కస్టమర్లు ఫుడ్ డెలివరీ యాప్ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో నెంబర్ వెతికి ఆ నెంబర్లకు డయల్ చేసి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు.

ఆహారం క్యాన్సిల్ చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబరుకు డయల్

ఆహారం క్యాన్సిల్ చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబరుకు డయల్

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలోని విరాట్ ఖండ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కూడా తనకు నచ్చిన ఆహారంను ఫుడ్ డెలివరీ యాప్‌ ద్వారా ఆర్డర్ ఇచ్చాడు. అయితే తను అనుకున్న సమయానికి ఆహారం చేరలేదు. వెంటనే ఆన్‌లైన్‌లో ఆ ఫుడ్ డెలివరీ యాప్‌కు చెందిన టోల్ ఫ్రీ నెంబర్‌ వెతికి ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఓ వ్యక్తి తాను ఆ ఫుడ్ డెలివరీ యాప్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. ఓ యాప్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని తన సేవింగ్స్ ఖాతాలోకి లాగిన్ అవమన్నాడు.

 నాలుగు నిమిషాల్లో నాలుగు లక్షలు మాయం

నాలుగు నిమిషాల్లో నాలుగు లక్షలు మాయం

ఫుడ్ డెలివరీ యాప్ ప్రతినిధిగా చెప్పుకున్న వ్యక్తి చెప్పినట్లుగానే కస్టమర్ యాప్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని బ్యాంకు వివరాలు చెప్పాడు. వెంటనే ఓ ఓటీపీ వచ్చింది. రీఫండ్ రావాలంటే ఆ ఓటీపీని అందులో ఎంటర్ చేయాల్సిందిగా ఆ డూప్లికేట్ ప్రతినిధి చెప్పాడు. ఇక కస్టమర్ ఓటీపీని అందులో టైప్ చేయగానే నాలుగే నిమిషాల్లో నాలుగు లక్షల రూపాయలు ఖాతా నుంచి మాయమయ్యాయి.

మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతిలోకి..

మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతిలోకి..

తన ఖాతా నుంచి రూ.4 లక్షలు మాయమవడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కస్టమర్ ఇన్స్‌టాల్ చేసుకున్న యాప్... ఆ కస్టమర్ ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ ఇస్తుందని పోలీసులు చెప్పారు. ఓటీపీ ఎంటర్ చేయగానే అతని సమాచారం అంతా సైబర్ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఇక బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు, పాస్‌వర్డ్‌లు తెలుసుకుని అకౌంట్‌లో ఉన్న మొత్తం డబ్బులను మాయం చేశాడని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకుని డూప్ చేసి డబ్బులు కాజేసిన వ్యక్తిని పట్టుకునేందుకు సైబర్ సెల్ సహాయం తీసుకుంటున్నామని గోమతినగర్ ఎస్సై అమిత్ కుమార్ దూబే చెప్పారు.

English summary
On Wednesday, a man trying to cancel an order made through a food delivery app by using a toll-free number was cheated of Rs 4 lakh in Virat Khand area of Gomtinagar.It was later found that the toll-free number was fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X