• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రియల్ స్టోరీ: ఒంటరి యువతికి డెలివరీ బాయ్ వేధింపులు

By Nageswara Rao
|

హైదరాబాద్: బెంగుళూరులో ఉద్యోగ నిమిత్తం ఒంటరిగా ఉంటున్న ఓ యువతికి డెలివరీ బాయ్ నుంచి వచ్చిన వేధింపులు చివరకు ఆమెను నగరాన్నే విడిచేలా చేశాయి. వివరాల్లోకి వెళితే అంకిత(పేరు మార్చాం) అనే ఓ యువతి వంట చేసుకునే ఓపిక లేక మొబైల్ యాప్ ద్వారా సమీపంలోని ఓ రెస్టారెంట్ ద్వారా తనకిష్టమైన ఆహారాన్ని ఓ రెస్టారెంట్ నుంచి తెప్పించుకుంది.

ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన ఆ డెలివరీ బాయ్ తనకో గ్లాసు మంచినీళ్లు కావాలని అడిగడంతో అంకిత తెచ్చి ఇచ్చింది. ఆమె ఇచ్చిన గ్లాసుడు నీరు పీడకలలను మిగులుస్తుందని ఆమెకు ఆ సమయంలో తెలియదు. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.

ఆ డెలివరీ బాయ్ అంకితకు ఫోన్ చేసి అభ్యంగా మాట్లాడటం, వేధించడం మొదలు పెట్టాడు

. దీంతో ఆ యువతి ఆ నెంబర్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మరో నెంబర్ నుంచి కాల్ చేసేవాడు. చివరకు ఆ యువతి తన నెంబర్ మార్చుకున్నా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు.

Food delivery boy's constant, harassing calls force woman to leave Bengaluru

ఆ డెలివరీ బాయ్ వేధింపులకు బెంగుళూరుని వదిలి వెళ్లినా ఆమెకు అతడి నుంచి లైంగిక వేధింపులు ఆగలేదని, పోలీసులకు పిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతూ గురువారం అంకిత ట్విట్టర్‌లో పోస్టు చేసిన పిటిషన్‌కు విశేష స్పందన వచ్చింది.

ఆ ట్వీట్‌లో తాన గతేడాది అక్టోబర్ 10న కోరమంగళ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ నుంచి పుడ్ తెప్పించుకున్నానని, అప్పుడు 10:30 గంటల సమయంలో బాయ్ వచ్చాడని, తాను ఓ చిన్న గదిలో ఒంటరిగా ఉంటున్నట్టు తెలుసుకుని వేధింపులు మొదలు పెట్టాడని పేర్కొంది.

డెలివరీ బాయ్ వ్యవహారాన్ని రెస్టారెంట్ యజమానికి తెలియజేస్తే, అతినితో క్షమాపణలు చెప్పించి, తన స్నేహితుడి నెంబర్ అనుకుని కాల్ చేస్తున్నాడని సర్ది చెప్పారని, ఆ తర్వాత కూడా మిస్డ్ కాల్స్, వేధింపులు, అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆమె వాపోయింది.

తనకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడల్లా 3-4 యువకులు కామెంట్లు చేస్తూ, నవ్వుకుంటున్నట్టు వినిపిస్తుండేదని తెలిపింది. ఒక రాత్రిలో తాను 4-5 నెంబర్లను బ్లాక్ చేశానని, అయినా సరే కొత్త నెంబర్ల నుంచి తనకు వేధింపులు మొదలయ్యేవని వివరించింది.

ఈ సంఘటన జరిగి సంవత్సరం గడుస్తున్నా తనకు ఈ వేధింపులు మాత్రం ఆగలేదని వాపోయింది. డెలివరీ బాయ్ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని నెలల క్రితం బెంగుళూరు నుంచి వెళ్లినా తనకు ఈ మంగళవారం తెల్లవారుజామున 2.25 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని ఆమె పేర్కొంది.

అంకిత ట్విట్టర్ పోస్టు అనంతరం ఆమెకు సంఘీభావంగా వేలాది మంది నిలవడంతో, ఓ సీనియర్ పోలీసు అధికారి ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. తాను బ్లాక్ చేసిన నెంబర్లను అడిగి మరీ తీసుకున్నారు. మరికొంత మంది సీనియర్ పోలీసు అధికారులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

English summary
One day Ankita was feeling too lazy to cook, so she used the mobile app on her phone to order her favourite dishes from a restaurant. The delivery boy came with the food, she paid him and then he asked for a glass of water. She brought him water but had no idea that this one kind act on her part would make her life a nightmare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X