వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్విగ్గీలో కొత్త సర్వీస్ వచ్చిందా..? ఫుడ్‌తోపాటు ‘మందు’ డెలివరీ చేస్తోందా..?

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఆహార ప్రియులకు ఫుడ్ అందిస్తుంటారని మనకు తెలుసు. కానీ, ఇక్కడ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం ఫుడ్ తోపాటు మద్యం కూడా అందిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

స్విగ్గీనే మద్యం కూడానా?

స్విగ్గీనే మద్యం కూడానా?

స్విగ్గీలో ఫుడ్ డెలివరి బాయ్‌గా పనిచేస్తూనే మద్యం కూడా ఇతను డెలివరీ చేస్తుండటం గమనార్హం. దీంతో వినియోగదారుల్లో స్విగ్గీనే మద్యం కూడా డెలివరీని ప్రారంభించిందా? అనే సందేహం కలిగింది. చివరకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.

అప్పులు చేసి పార్టీలు..

అప్పులు చేసి పార్టీలు..

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన రాహుల్ మహిదా అనే 25ఏళ్ల యువకుడు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో గత ఏడు నెలలుగా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం వివాహమైంది. వివాహం సందర్భంగా అప్పులు చేసి మరీ స్నేహితులతో పార్టీలు చేసుకున్నాడు ఈ యువకుడు.

ఫుడ్ తోపాటు మద్యం..

ఫుడ్ తోపాటు మద్యం..

పెళ్లి తర్వాత ఖర్చులు, అప్పులు పెరిగిపోవడంతో ఏదైనా సైడ్ బిజినెస్ చేయాలనుకున్నాడు. ఎక్కువ డబ్బులు వస్తాయి కాదా అని.. ఫుడ్ డెలివరీతోపాటు మద్యాన్ని కూడా ఇంటింటికీ అందించడం మొదలుపెట్టాడు. డబ్బులు బాగానే రావడంతో అదే కొనసాగించాడు. 20రోజులపాటు ఇలానే చేశాడు.

చివరకు కటకటాలపాలు

చివరకు కటకటాలపాలు

అయితే, కొందరు వినియోగదారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై నిఘా పెట్టిన పోలీసులు.. గత ఆదివారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు. రూ. 600 విలువైన ఆరు బీరు బాటిళ్లు, రూ. 7వేల విలువ చేసే ఒక స్మార్ట్ ఫోన్, రూ. 40వేల డబ్బును రాహుల్ వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
A food delivery boy was nabbed by Vadodara police on Sunday after intelligence input that he was also carrying liquor in his delivery bag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X