వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మ కథ అడ్డం తిరిగింది!: పార్టీ చీఫ్ ఇప్పటికీ శశికళనే.. కానీ?

సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు అన్నాడీఎంకేలోని ఇరువర్గాలలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరవై నాలుగు గంటల ఉత్కంఠ అనంతరం శశికళ, దినకరన్‌లపై వేటు వేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు అన్నాడీఎంకేలోని ఇరువర్గాలలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరవై నాలుగు గంటల ఉత్కంఠ అనంతరం శశికళ, దినకరన్‌లపై వేటు వేశారు. ఉత్కంఠను పెంచుతూ చివరకు సంచలన ప్రకటనకు దారి తీశాయి.

ప్రస్తుతం కేవలం అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగా శశికళ కేవలం పేపర్‌కే పరిమితమని పన్నీరుసెల్వంతో జతకట్టిన చిన్నమ్మ వర్గం నేతలు చెప్పారు. పార్టీ అధినేత్రిగా ఆమెను ఎన్నుకున్నారు. దీనిపై పన్నీరువర్గం ఈసీకి ఫిర్యాదు చేసింది.

చేజేతులా..: శశికళ ఖేల్ ఖతం?: పీఠం ఎక్కిస్తే వారే రివర్స్!చేజేతులా..: శశికళ ఖేల్ ఖతం?: పీఠం ఎక్కిస్తే వారే రివర్స్!

ఈసీ దీనిపై విచారణ జరుపుతోంది. కాబట్టి ప్రస్తుతానికి శశికళ పేపర్ వరకు మాత్రమే అధినేత్రి అని చెబుతున్నారు. ఇరువర్గాలు విలీనమైన నేపథ్యంలో.. ఈసీ విచారణలో శశికళకు టెక్నికల్‌గా కూడా ఇబ్బందులే. ప్రస్తుతం పేపర్ వరకు అధినేత్రిగా ఉన్న ఆమెను తొలగించే అవకాశముంది.

ఆ తర్వాతే ఆమె తొలగింపు

ఆ తర్వాతే ఆమె తొలగింపు

అయితే ఈసీ విచారణ జరిగిన తర్వాతనే ఆమెను తొలగించేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఇరువర్గాలు ఆమెకు వ్యతిరేకమే. కేవలం కొందరు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పదవికి చెక్ పడినట్లే.

అయితే, శశికళ కుటుంబం పార్టీ నుంచి దూరమైతేనే విలీనమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మంగళవారం కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కుటుంబ పాలనను అన్నాడీఎంకే మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని తేల్చి చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని, జయలలిత బతికి ఉంటే ఆమెను తరిమేసేవారని పన్నీరు అన్నారు.

పన్నీరుసెల్వం దూరమైతేనే అని..

పన్నీరుసెల్వం దూరమైతేనే అని..

పన్నీర్‌సెల్వం దూరమైతేనే విలీనమని శశికళ వర్గం నేత, మాజీ ఎమ్మెల్యే వీపీ కళైరాజన్‌ పేర్కొన్నారు. ఇరువర్గాల విలీనంపై విద్యుత్తుశాఖ మంత్రి తంగమణి నివాసంలో సోమవారం రాత్రి మంత్రులు సమావేశమయ్యారు.

వారు విలీనానికి సానుకూల సంకేతాలిచ్చారు. చర్చల్లో భాగంగా మంగళవారం చెన్నై తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ యుద్ధనౌకలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలుసమావేశమయ్యారు.

పదవులపై తర్జన భర్జన

పదవులపై తర్జన భర్జన

ఇందులో సీఎం పళనిస్వామి పాల్గొనలేదు. సీనియర్‌ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆయన వర్గానికి స్పీకర్ పదవితో పాటు మంత్రి పదవులు ఇవ్వవచ్చనే వదంతులు వచ్చాయి. ఈ ఒప్పందంతోనే ఇరువర్గాలు ఒక్కటవుతాయనే వాదనలు వినిపించాయి.

మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశం దినకరన్‌ను దూరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు పన్నీరుసెల్వం తన పంతం నెగ్గించుకున్నారు. పన్నీరునే పక్కన పెట్టాలన్న శశికళ వర్గం నేత ఆశలు నిరాశలయ్యాయి.

ఎట్టకేలకు సొంత పార్టీ షాకిచ్చింది

ఎట్టకేలకు సొంత పార్టీ షాకిచ్చింది

ఎట్టకేలకు, తమిళనాడులో అధికార అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ చిన్నమ్మ శశికళకు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆమె మేనల్లుడు దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని మొత్తంగా దూరం పెడతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి డి జయకుమార్‌ ప్రకటించారు. పార్టీ ఎంపీలు, మంత్రులు, జిల్లా కార్యదర్శులు అందరూ కలిసి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

సయోధ్య కుదిరింది ఇలా..

సయోధ్య కుదిరింది ఇలా..

టీటీవీ దినకరన్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన అనంతరం చెన్నైలో మీడియాతో మాట్లాడిన పన్నీర్‌‌సెల్వం అన్నాడీఎంకే తిరిగి ఏకమయ్యేందుకు శశికళ వర్గానికి చెందిన నాయకులు ముందుకు వస్తే తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు. పన్నీర్‌ సెల్వం ఈ ప్రకటన అనంతరం శశికళ వర్గంలో కీలకనేత, లోకసభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై చెన్నై సచివాలయంలో రెండు సార్లు ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశమయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నీర్‌ సెల్వం ప్రకటనను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని తంబిదురై తెలిపారు. తమ పార్టీలో చీలిక ఏర్పడలేదని తెలిపారు. ఆ తర్వాత పలుదఫాలుగా చర్చలు జరిగాయి.
మాజీ సీఎం పళనిస్వామితో సుదీర్ఘ మంతనాల అనంతరం ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇకపై పార్టీలో, ప్రభుత్వంలో శశికళ కుటుంబం ప్రమేయం ఉండబోదని చర్చల అనంతరం మంత్రి జయకుమార్‌ వెల్లడించారు. తమ ప్రధాన డిమాండ్‌కు శశికళ వర్గంలోని నేతలు అంగీకరించడంతో సయోధ్య కుదిరింది.

డ్రామా

డ్రామా

అన్నాడీఎంకే ఇరువర్గాల విలీనం డ్రామా అని కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం వ్యాఖ్యానించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇరువర్గాలు కలిసి జయలలిత మరణం విషయంలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నాయన్నారు.

English summary
Sasikala will continue to lead the party on paper, since the Election Commission is examining the legality of her appointment. An expulsion will be possible only after the Commission comes to a decision, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X