వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ బీజేపీలో కలవరం, క్రమంగా పట్టు సాధిస్తున్న కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : గుజరాత్ లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి సవాల్‌గా మారాయి. మోడీ సొంత రాష్ట్రం కావడంతో మెజార్టీ స్థానాలు అకౌంట్‌లో వేసుకోవాలని కమలదళం భావిస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవం ఆ పార్టీని కలవరపెడుతోంది. గుజరాత్‌లో మొత్తం 26 లోక్ సభ స్థానాలుండగా.. వాటిలో ఏడింటిలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి గట్టిపోటీ ఎదురుకానుంది.

కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!

అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం

అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం

2017లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ ఎవరూ ఊహించని విధంగా 77 సీట్లు గెల్చుకుంది. గుజరాత్‌లో బీజేపీ రెండు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని ఫలితాలు చవిచూడటంతో కమలదళంలో కలవరం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయన్న భయం బీజేపీ నేతల్లో నెలకొంది.

సౌరాష్ట్రలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ

సౌరాష్ట్రలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ

సౌరాష్ట్ర - కచ్ ప్రాంతంలో కొంతకాలంగా కాంగ్రెస్ క్రమంగా బలం పుంజుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం 54 సీట్లలో 30 కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. సౌరాష్ట్రలో బీజేపీకి పట్టున్న ప్రాంతాలు ఇప్పుడు ఆ పార్టీ చేజారిపోతున్నాయి. స్థానిక సమస్యలను అధికారపార్టీ పట్టించుకోకపోవడం, పాటీదార్ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడంతో ప్రజల్లో బీజేపీపై అసంతృప్తి పెరిగింది.

సౌరాష్ట్రలో 7స్థానాలపై బీజేపీ ఆందోళన

సౌరాష్ట్రలో 7స్థానాలపై బీజేపీ ఆందోళన

గుజరాత్ లోక్‌సభ ఎన్నికల్లో 12 నుంచి 13 సీట్లు ఖాతాలో వేసుకుంటామని కాంగ్రెస్ భావిస్తోంది. సౌరాష్ట్రలో బీజేపీకి పట్టున్న ఆమ్రేలీ, జునాఘడ్, బోతాడ్, సురేంద్రనగర్ స్థానాల్లో ఈసారి తమ జెండా ఎగరడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక సెంట్రల్ గుజరాత్‌లో‌ని ఆనంద్, నార్త్ గుజరాత్‌లోని బనాస్‌కాంత, పఠాన్, చోటా ఉదయ్‌పూర్‌లలోనూ ఈసారి పట్టుసాధిస్తామని ధీమాతో ఉన్నారు.
ఇప్పుడిదే బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలోని 26 సీట్లను గెల్చుకుంది. కానీ ఈ సారి ఆ ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడంలేదు.

బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ అస్త్రాలు

బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ అస్త్రాలు

రైతాంగ సమస్యలు, పాటీదార్ల ఉద్యమం బీజేపీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లాగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇవే అంశాలు అభ్యర్థుల జయపజయాలను నిర్ణయించే అవకాశముంది. దీంతో వాటినే అస్త్రాలుగా మలుచుకున్న కాంగ్రెస్ ఓటర్లను తనవైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది.

English summary
If the Congress's performance in the 2017 Gujarat Assembly polls was any indication, the BJP may have to sweat it out in at least seven Lok Sabha seats, most of them in its bastion Saurashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X