వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుప్త నిధుల కోసం .. అమావాస్య నాడు కాళీమాతకు ఐదుగురు చిన్నారుల బలికి యత్నం

|
Google Oneindia TeluguNews

గుప్త నిధుల కోసం నరబలులు , పిల్లలు పుడతారని చేతబడులు .. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధిస్తున్నా మూఢనమ్మకాలు ఇంకా కొన్ని రాష్ట్రాలలో ప్రబలంగానే ఉన్నాయి. మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్న వారు జంతు బలులు, నర బలులు కొనసాగిస్తున్న కథనాలు నిత్యం వింటున్నాం . తాజాగా జార్ఖండ్‌లో నరబలి ఘటన చోటు చేసుకోగా అస్సాంలో ఇప్పుడు మరో నరబలుల యత్నం జరిగింది. కన్నతండ్రి కొడుకు పుడతాడని కూతురి గొంతు కోసి అత్యంత పాశవికంగా బలి ఇచ్చిన ఘటన మరువక ముందే అస్సాంలో గుప్త నిధుల కోసం ఐదుగురు పిల్లలని బలి ఇవ్వటానికి ప్రయత్నం జరిగింది .

కొడుకు పుట్టటం కోసం కూతురు బలి .. గొంతుకోసి పాశవికంగా చంపిన తండ్రికొడుకు పుట్టటం కోసం కూతురు బలి .. గొంతుకోసి పాశవికంగా చంపిన తండ్రి

గుప్తనిధుల కోసం కాళీమాతకు చిన్నారుల బలికి యత్నం

గుప్తనిధుల కోసం కాళీమాతకు చిన్నారుల బలికి యత్నం

అసోంలోని శివసాగర్ జిల్లాలోని శివసాగర్ జిల్లాకు చెందిన జమియుల్ హుస్సేన్, షరీఫుల్ హుస్సేన్ లు అమావాస్య నాడు కాళీ మాతకు చిన్నారులను బలిస్తే గుప్తనిధులు దొరుకుతాయని మంత్రగాడి మాటలు విని తమ ఇంటి వెనకాల ఉన్న మామిడి చెట్టుకు చిన్నారులను కట్టేసి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాళీమాతకు చిన్నారులను బలిస్తే గుప్తనిధులు దొరకడంతో పాటు కుటుంబంలోని అన్ని సమస్యలు తీరుతాయని మాంత్రికుడు వారికి చెప్పడంతో అది నమ్మి పిల్లలను బలి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు.

ఐదుగురు చిన్నారులను రెస్క్యూ చేసిన పోలీసులు

ఐదుగురు చిన్నారులను రెస్క్యూ చేసిన పోలీసులు

ఈ విషయం తెలిసిన పోలీసులు ఐదుగురు మైనర్ బాలురను బలి ఇవ్వకుండా రక్షించారు. గుప్త నిధి వస్తుందనే ఆశతో మంత్రగాడి సలహా మేరకు మైనర్ బాలురలో ఒకరి తండ్రి తన సొంత కొడుకులను, తన సోదరుడి ముగ్గురు కొడుకులను బలి ఇవ్వాలనుకున్న ఘటనపై ఇంకా దర్యాప్తు సాగుతుందని అంటున్నారు పోలీసులు . అయితే వారు నరబలికి ప్రయత్నించారని దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు . నరబలులు జరగబోతున్నాయనే సమాచారంతో ఒక పోలీసు బృందాన్ని డెమోముఖ్ కు పంపామని, ఐదుగురు అబ్బాయిలను మా అదుపులోకి తీసుకున్నామని శివసాగర్ పోలీసు సూపరింటెండెంట్ అమితవ సిన్హా అన్నారు.

 క్షుద్ర పూజలు, నరబలులపై స్థానికుల ఫిర్యాదు .. పోలీసుల దర్యాప్తు

క్షుద్ర పూజలు, నరబలులపై స్థానికుల ఫిర్యాదు .. పోలీసుల దర్యాప్తు

నరబలుల కోసం ప్రయత్నించిన ఆరోపణలు ఇంకా ధృవీకరించబడలేదు. దీనిపై ప్రచారం జరగటం మినహాయించి నేరం గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవని అంటున్నారు . స్థానికుల కథనం ప్రకారం, అబ్బాయిలలో ఒకరి తండ్రి చిన్నారులను బలి ఇవ్వాలనుకున్నాడు. వారు క్షుద్ర పూజలను ప్లాన్ చేశారని , పిల్లలను బలి ఇవ్వాలనుకున్నారని అంటున్నారు. ఈ సంఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరియు మైనర్ అబ్బాయిల తండ్రులు అయిన జమీరుల్ హుస్సేన్ మరియు షరీఫుల్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు మరింత విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

English summary
Police in Assam’s Sivasagar district have rescued five minor boys following allegations from local residents that they were about to be sacrificed by the father of one of the boys.While reports in local news channels claim that the father of one of the boys wanted to sacrifice his own son and the sons of his brother on the advice of a witch doctor with the hope of getting some hidden treasure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X