వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్కంఠకు తెర: సోనియా, రాహుల్‌ గాంధీలకు బెయిల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరైంది. సోనియా, రాహుల్ గాంధీల తరుపున మాజీ ప్రధాని మన్మోసింగ్, అహ్మాద్ పటేల్ బెయిల్ పత్రాలు సమర్పించారు.

పాటియాలో కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసును విచారించిన రెండో మెట్రోపాలిటన్ జడ్జి లవ్లీసింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్‌కు 50వేల పూచీకత్తుతో బెయిల్ మంజారు చేశారు. ఈ కేసు రెండో విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను కేవలం 3 నిమిషాల్లోనే ముగియడం విశేషం.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక బెయిల్ బాండ్లను సమర్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు ఎలాంటి షరతులు లేని బెయిల్‌ను పాటియాలా కోర్టు మంజారు చేసింది.

National Herald Case

ఈ కేసులో మొత్తం ఏడుగురికి పాటియాలా హౌజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం సోనియా, రాహుల్ గాంధీలు తిరిగి వెళ్లిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విచారణకు మధ్యాహ్నాం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరయ్యారు.

సోనియా గాంధీ వెంట ఆమె కూతురు ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌‌తో పాటు మోతీలాలో వోరా ఉన్నారు. పాటియాలా కోర్టు ఆవరణలోని గేట్ నెంబర్ 2 నుంచి సోనియా గాంధీ కోర్టు లోపలికి వెళ్లారు. మరికాసేపట్లో నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ప్రారంభమైంది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను రెండో మెట్రోపాలిటన్ జడ్జి లవ్లీసింగ్ చేపట్టారు.

ఈ కేసులో సోనియా, రాహుల్ తరుపున ఆరుగురు లాయర్లు వాదించారు. ఇప్పటికే అహ్మాద్ పటేల్, అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబాల్ లాంటి హేమాహేమీ లాయర్లు కోర్టుకు చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ప్రముఖులు పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ ర్యాలీలో సోనియా కూతురు, అల్లుడు ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కూడా పాలుపంచుకోనున్నారు.

ఇదే విషయాన్ని రాబర్ట్ వాద్రా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఇప్పటికే పాటియాలా కోర్టు చుట్టుపక్కల ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సుమారు 700 మంది సెక్యూరిటీ సిబ్బంది అక్కడ మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పాటియాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సీసీటీవీ కెమెరాలను, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

National Herald Case

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి మోతీలాల్‌ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, సుమన్‌ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ కేసులో పాటియాలా కోర్టు జడ్జి అరెస్ట్‌కు ఆదేశిస్తే అందుకు వెనుకాడకూడదని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ తప్పని పక్షంలో కోర్టును బెయిల్ కోరాలని ఆమె భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కోర్టుకు వెళ్లే సమయంలో వెంట బెయిల్ పిటిషన్లను తీసుకెళ్లి, అక్కడి పరిణామాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కోర్టులో దాఖలు చేయాల్సిన బెయిల్ పిటిషన్‌ను కూడా ఆమె సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సోనియా, రాహుల్ గాంధీలు ఈరోజు పాటియాలా కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న సోనియా, రాహుల్ గాంధీల పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

English summary
Since they have come to power, they are targeting Opposition parties. Such has never happened. In the last one year, be it the Gujarat Opposition leader, Himachal Pradesh Chief Minister - all targeted in raids," Congress leader Ghulam Nabi Azad said..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X