• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒబామా రాక: అమెరికా షరతులు.. సత్తా ఉందని తోసిపుచ్చిన భారత్

By Srinivas
|

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే కవాతుకు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరువుతున్న నేపథ్యంలో ఆ దేశ అధికారులు భారత్‌కు ఏకపక్ష ప్రతిపాదనలు చేశారు. కవాతు జరిగే రాజ్‌పథ్ ప్రాంతంలో ఎత్తైన భవనాలపై తమ షార్ప్ షూటర్లను మోహరిస్తామ కోరారు. ఈ ప్రతిపాదనను భారత్ సున్నితంగా తిరస్కరించింది. తమ భద్రతా ఏర్పాట్లలో జోక్యం చేసుకోరాదని సూచించింది.

వీవీఐపీలకు రక్షణ కల్పించే సుశిక్షితులైన మానవవనరులు, పరికరాలు తమ వద్ద ఉన్నాయని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున తమ సిబ్బందిని వినియోగించడం తప్పనిసరి అని భారత భద్రతాధికారులు చెప్పారు. అంతేకాకుండా, వేడుక జరిగే ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న అమెరికా ప్రతిపాదనను కూడా తోసిపుచ్చింది.

దీనివల్ల కవాతుకు ప్రధాన ఆకర్షణగా నిలిచే వైమానిక విన్యాసాలను రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రతి ప్రదేశానికి చేరుకోవడానికి మూడు మార్గాలు ఉండాలని కూడా అమెరికా అధికారులు వాదించారు. అవి భారత్‌కు చెందిన ఇతర ప్రముకులు ప్రయాణిచేవి అయి ఉండకూడదని సూచించారు. అయితే, చర్చోపచర్చల తర్వాత మార్గ ప్రణాళికను ఆతిథ్య దేశమే నిర్ణయించాల్సి ఉంటుందని భారత అధికారులు చెప్పారు.

For President Obama, a Security Camera Every 180 metres on Delhi's Rajpath

ఢిల్లీ, ఆగ్రాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలివి!

గణతంత్ర వేడుకల్లో పరేడ్‌ జరిగే రాజ్‌పథ్‌ రోడ్డు పొడవు 3 కిలోమీటర్లు. ఇక్కడ సగటున 180 మీటర్లకు ఒకటి చొప్పున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలో మొత్తం 15 వేల సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు.

ఒబామా వస్తున్నప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలోని ఒక భాగం మొత్తం అమెరికా భద్రతాదళాల ఆధీనంలోకి వెళ్తుంది.

ఒబామా 27న తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్నప్పుడు కొన్ని గంటలు ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై రాకపోకలు బంద్‌.

ఢిల్లీలోని రాజ్‌పథ్‌ రోడ్డు చుట్టుపక్కల ఉన్న రఫీ మార్గ్‌, జన్‌పథ్‌, మాన్‌సింగ్‌ రోడ్‌లలో 24 నుంచి 26 వరకూ ఆంక్షలు. మౌర్య షెరటాన్‌ రోడ్‌, సర్దార్‌ పటేల్‌ మార్గ్‌, తీన్‌ మూర్తి మార్గ్‌లలో 26న రాకపోకలు బంద్.

గణతంత్ర వేడుకల పరేడ్‌ను ఒబామా రెండు గంటలపాటు వీక్షించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం వీవీఐపీ ఎన్‌క్లోజర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ రక్షణ కల్పించే అవకాశముంది.

సస్పెన్స్

అమెరికా అధ్యక్షులు ఏ దేశానికి వెళ్లినా భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్న తమ సొంత వాహనం (బీస్ట్‌)లో ప్రయాణిస్తారు. కానీ రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఇతర దేశాల అధిపతులు రాష్ట్రపతితో కలిసి వారి వాహనంలోనే వేదికను చేరుకోవడం సంప్రదాయం. ఒబామా ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తారా? లేక బీస్ట్‌‌లోనే ప్రయాణిస్తారా? ప్రస్తుతానికి ఇది సస్పెన్స్‌! ఇందులో ఏది జరిగినా అదే మొదటిసారి అవుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A section of Delhi's international airport will be taken over by the US Secret Service when President Barack Obama lands in Air Force One on Sunday, January 25, for India's Republic Day celebrations a day later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more