వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ 2020 జాబితా: 100 వరల్డ్ పవర్ ఫుల్ మహిళలలో నిర్మలా సీతారామన్, కమలా హ్యారిస్ కు చోటు

|
Google Oneindia TeluguNews

2020 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో భారత దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో పాటుగా, ఫార్మా కంపెనీ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్సిఎల్ కార్పొరేషన్ సీఈవో రోషిని నాదర్ మల్హోత్రా కూడా స్థానం దక్కించుకున్నారు. 2019 సంవత్సరంలో కూడా ఫోర్బ్స్ జాబితాలో ఈ ముగ్గురికి స్థానం దక్కింది. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ కు ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానం దక్కింది.

100 అత్యంత శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ 2020 జాబితా విడుదల

100 అత్యంత శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ 2020 జాబితా విడుదల

100 అత్యంత శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ 2020 జాబితాలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా 10 వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. 17 వ వార్షిక ఫోర్బ్స్ పవర్ లిస్ట్‌లో ఉన్న మహిళలు 30 దేశాలకు చెందినవారు మాత్రమే కాదు నాలుగు తరాలలో జన్మించిన వారని ఫోర్బెస్ పేర్కొంది. వారిలో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు ఎంటర్టైనర్లు ఉన్నారు.

2020 ఫోర్బ్స్ జాబితాలో ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్

2020 ఫోర్బ్స్ జాబితాలో ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్

ఈ జాబితాలోభారతదేశ ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 41 వ స్థానంలో, రోషినీ నాదర్ మల్హోత్రా 55 వ స్థానంలో నిలిచారు, మజుందార్-షాను భారతదేశపు అత్యంత సంపన్నమైన స్వయం నిర్మిత మహిళగా అభివర్ణించారు ఆమె 68 వ స్థానంలో నిలిచారు . మరియు ల్యాండ్‌మార్క్ గ్రూప్ చైర్‌మెన్ రేణుకా జగ్టియాని 98 వ స్థానంలో ఉన్నారు.2019 సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో కి ఎంట్రీ ఇచ్చారు.

నిర్మలతో పాటు , కిరణ్ మంజుదార్ షా , రోషినీ నాదర్ మల్హోత్రా కు స్థానం

నిర్మలతో పాటు , కిరణ్ మంజుదార్ షా , రోషినీ నాదర్ మల్హోత్రా కు స్థానం

2019 సంవత్సరంలో ఆమె మోస్ట్ పవర్ఫుల్ మహిళల్లో 34వ స్థానంలో నిలిచారు. కానీ ఈ ఏడాది నిర్మల సీతారామన్ 41వ స్థానంలో నిలిచారు. దాదాపు ఏడు స్థానాలు వెనుకకు ఆమె వెళ్లిపోయారు. హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్మన్ రోషినీ నాదర్ మల్హోత్రా 2019లో 54వ స్థానంలో ఉంటే, ఈ ఏడాది 55వ స్థానంలో నిలిచారు. కిరణ్ మజుందార్ షా గత ఏడాది 65 స్థానంలో ఉంటే, 2020లో 68వ స్థానానికి పడిపోయారు.

మెర్కెల్ మొదటి స్థానంలో .. రెండో స్థానంలో క్రిస్టిన్ లగార్డ్ .. మూడో స్థానంలో కమలా హ్యారిస్

మెర్కెల్ మొదటి స్థానంలో .. రెండో స్థానంలో క్రిస్టిన్ లగార్డ్ .. మూడో స్థానంలో కమలా హ్యారిస్

మెర్కెల్ వరుసగా పదవ సంవత్సరం నంబర్ 1 స్థానంలో ఉంది. మెర్కెల్ జర్మనీ చాన్సెలర్ కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో జర్మనీని వృద్ధికి తీసుకువచ్చిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మెర్కెల్ నాయకత్వం వహించారు .యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండవ సంవత్సరానికి రెండవ స్థానంలో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి మహిళ, మొదటి బ్లాక్ అమెరికన్ , మొదటి ఆసియా అమెరికన్ కాలిఫోర్నియా సెనేటర్ హారిస్‌కు ఈ జాబితాలో మూడవ స్థానం దక్కింది .హారిస్ యు.ఎస్. రాజకీయాల్లో వేగవంతమైన ముందడుగు ఆమెను మొదటిసారి ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది.

కరోనా సమయంలో శక్తివంతంగా పని చేసిన మహిళలకు గ్లోబల్ ప్రశంసలు

కరోనా సమయంలో శక్తివంతంగా పని చేసిన మహిళలకు గ్లోబల్ ప్రశంసలు

కోవిడ్ 19 సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొన్న కారణంగా ఈ సంవత్సరం పవర్ మహిళల్లో చాలామంది గ్లోబల్ ప్రశంసలు అందుకున్నారు. ఈ సంవత్సరం జాబితాలో 17 మంది కొత్తవారు ఉన్నారని ఫోర్బ్స్ పేర్కొంది .ఈ జాబితాలో ఉన్నవారి వయస్సు, జాతీయత మరియు ఉద్యోగ వివరణ విభిన్నంగా ఉన్నప్పటికీ 2020 యొక్క ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్న తీరులో మాత్రం వారు సమానంగా ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది..

English summary
Union Finance Minister Nirmala Sitharaman, HCL Enterprise CEO Roshni Nadar Malhotra , founder of India’s biopharmaceutical company Biocon, Kiran Mazumdar Shaw, in world’s 100 most powerful women by Forbes this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X