వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ 2022 జాబితా: వరుసగా నాలుగోసారి శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్!!

|
Google Oneindia TeluguNews

2022 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా నాలుగో సారి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ మరోమారు చోటు సంపాదించారు.

ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుండి ఆరుగురికి స్థానం.. ముందు వరుసలో నిర్మలా సీతారామన్

ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుండి ఆరుగురికి స్థానం.. ముందు వరుసలో నిర్మలా సీతారామన్

భారతదేశంలో ఆరుగురికి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కగా అందులో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ముందు వరుసలో నిలిచారు. నిర్మల సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇది వరుసగా నాలుగో సారి. నిర్మల సీతారామన్ తో పాటు భారత దేశం నుంచి బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకులు ఫల్గుణి నాయర్, సెబి చైర్ పర్సన్ మదాభి పురి బచ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మొండల్ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

వరుసగా నాలుగోసారి ఫోర్బ్స్ జాబితాలో నిర్మలకు స్థానం

వరుసగా నాలుగోసారి ఫోర్బ్స్ జాబితాలో నిర్మలకు స్థానం

63 సంవత్సరాల మంత్రి నిర్మల సీతారామన్ 2019లో 34వ స్థానంలో, 2020 వ సంవత్సరంలో 41వ స్థానంలో, 2021లో ఫోర్బ్స్ జాబితాలో 37వ స్థానంలో నిలువగా, 2022 వ సంవత్సరంలో నిర్మలా సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు. వరుసగా నాలుగు సంవత్సరాలుగా ఆమె శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. పరపతి, మీడియా, ప్రభావం, మరియు ప్రభావిత రంగాలు ఆధారంగా, వీటిని కొలమానంగా తీసుకొని ఫోర్బ్స్ జాబితా రూపొందిస్తుందని వెల్లడించారు.

దేశంలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న మహిళల ర్యాంకులు ఇలా

దేశంలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న మహిళల ర్యాంకులు ఇలా

ఇదిలా ఉంటే భారతదేశం నుంచి శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్న ఫల్గుణి నాయక్ గత సంవత్సరం 88 వ స్థానంలో నిలువగా ఈసారి 89 వ స్థానంలో నిలిచారు. రోష్ని నాడార్ గతేడాది 52 వ ర్యాంక్లో నిలువగా ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో 53వ ర్యాంకు సాధించారు. ఇక కిరణ్ మజుందార్ షా మాత్రం 2021, 2022 రెండు సంవత్సరాలలోనూ 72వ స్థానంలో నిలిచారు. సెబి చైర్ పర్సన్ మదాభి పురి బచ్ 54వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మొండల్ 67 వ స్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ జాబితాలో వెల్లడించింది.

మొదటి స్థానంలో ఉర్సులా వాన్ డేర్, మూడో స్థానంలో కమలా హ్యారిస్

మొదటి స్థానంలో ఉర్సులా వాన్ డేర్, మూడో స్థానంలో కమలా హ్యారిస్

ఇదిలా ఉంటే ఈసారి ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ తొలి స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డే రెండవ స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మరోసారి నిర్మల సీతారామన్ వరుసగా నాలుగో సారి స్థానం దక్కించుకొని తన సత్తా చాటారు.

English summary
Forbes has released a list of the most powerful women in the world for the year 2022. Indian Finance Minister Nirmala Sitharaman took the position of 36. Nirmala Sitharaman has topped the Forbes list for the fourth time in a row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X