వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యకు ఇష్టంలేని శృంగారం రేప్ కాదు: ఢిల్లీ కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భార్య అనుమతి లేకుండా భర్త బలవంతంగా ఆమెను శారీరకంగా కలిస్తే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారంగా పరిగణించరాదని సంబంధిత ఢిల్లీ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. దంపతుల మధ్య శృంగారం... భార్యకు ఇష్టం లేకపోయినా సరే అత్యాచారం కిందకు రాదని కోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది.

ఢిల్లీకి చెందిన అఫ్తాబ్ ఆలం తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆయన భార్య వేసిన కేసును విచారించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి భర్తపై ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. వారిద్దరికీ 2012 జులై 20న వివాహమైందనీ. ఆ రోజు నుంచే వారిద్దరూ చట్టబద్దంగా భార్యాభర్తలనీ న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారం కానేకాబోదని న్యాయమూర్తి పునరుద్ఘాటించారు.

అఫ్తాబ్ ఆలం భార్య వాంగ్మూలం అనుమానాస్పదంగా ఉందనీ.. నమ్మవక్యంగా లేదనీ అన్నారు. కాబట్టి ఈ కేసులో అఫ్తాబ్ ఆలంకు సంశయలబ్ధి ఇవ్వొచ్చంటూ అతడిని నిర్దోషి అని తీర్పు ఇచ్చారు.

English summary
Physical relations between a husband and wife, even if they are against the woman's consent, do not amount to rape, a Delhi court has said while freeing a man of the charges of rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X