చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది, ప్రాణాలు కోల్పోయిన 4గురు జవాన్లు
శ్రీనగర్: చనిపోయినట్లుగా నటించిన ఓ టెర్రరిస్ట్.. భద్రతా బలగాలు దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం వచ్చింది భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.
దీనిని గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది లోనికి వెళ్లారు. అదే సమయంలో ఓ టెర్రరిస్ట్ చనిపోయినట్లుగా నటించాడు. భద్రతా సిబ్బంది దగ్గరకు రాగానే లేచి వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు, ఓ జవానుతో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ జరిగే ప్రదేశానికి సమీపంలో ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
సరిహద్దుల్లో కాల్పులు
భారత్ - పాకిస్తాన్ బార్డర్లో దాయాది పాక్ కవ్వింపు చర్యలు ఆపడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్, బాలాకోట్, కృష్ణఘాటి సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications