వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది, ప్రాణాలు కోల్పోయిన 4గురు జవాన్లు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: చనిపోయినట్లుగా నటించిన ఓ టెర్రరిస్ట్.. భద్రతా బలగాలు దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం వచ్చింది భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

దీనిని గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది లోనికి వెళ్లారు. అదే సమయంలో ఓ టెర్రరిస్ట్ చనిపోయినట్లుగా నటించాడు. భద్రతా సిబ్బంది దగ్గరకు రాగానే లేచి వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Forces Lose 4 In Kashmir Encounter; Dead Terrorist Fired

చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఓ జవానుతో పాటు మరో ఇద్దరు పోలీస్‌ అధికారులు ఉన్నారు. ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌ జరిగే ప్రదేశానికి సమీపంలో ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.

సరిహద్దుల్లో కాల్పులు

భారత్ - పాకిస్తాన్ బార్డర్లో దాయాది పాక్ కవ్వింపు చర్యలు ఆపడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్‌, బాలాకోట్‌, కృష్ణఘాటి సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

English summary
Four security personnel, including an officer, have died during an encounter with terrorists in Jammu and Kashmir's Kupwara district today. Sources say a terrorist, who was presumed dead, emerged from the rubble of a destroyed house and started firing which took the security personnel by surprise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X