చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ సింగర్ బాలు కోసం విదేశీ వైద్య బృందం .. పరిస్థితి విషమంగానే .. హరీష్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది . సినీ పరిశ్రమ వర్గాలు ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మరోపక్క 12 మంది సభ్యులు ఉన్న ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం బాలసుబ్రమణ్యం కు వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు.

Recommended Video

#LetsPrayForSPB: ఈ గ్లోబ్ లో SP Balasubrahmanyam లాంటివారు న భూతొ న భవిష్యతి !

కరోనా వచ్చి తగ్గిందని లైట్ తీసుకుంటే డేంజర్ ..హెచ్చరిస్తున్న కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుకరోనా వచ్చి తగ్గిందని లైట్ తీసుకుంటే డేంజర్ ..హెచ్చరిస్తున్న కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు

ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే ఉన్న బాలసుబ్రమణ్యంకు విదేశాల నుండి వైద్యులను రప్పించి వైద్యం చేయిస్తున్నారని సమాచారం . గత వారం రోజులుగా ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం బాలసుబ్రహ్మణ్యం కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు వైద్య బృందం. బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటుగా, అటు తమిళ చిత్ర పరిశ్రమ కూడా సామూహిక ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చింది. మరోపక్క బాలసుబ్రమణ్యం కు సంబంధించిన ఆసుపత్రి ఖర్చులన్నీ తమిళనాడు ప్రభుత్వమే భరిస్తోంది.

Foreign medical team treating singer Balu .. condition critical.. Harish tweet

ప్రస్తుతం విదేశీ వైద్య బృందం బాలసుబ్రహ్మణ్యం కు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, చేయి దాటి పోలేదని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. గత వారం రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాలసుబ్రహ్మణ్యం ఐసీయూలో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి కూడా బాలసుబ్రహ్మణ్యం కు సంబంధించిన క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్ గా పేరు ప్రఖ్యాతులు గడించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని చిరంజీవి, మోహన్ బాబు వంటి సినీ ప్రముఖులు భావోద్వేగ ట్వీట్స్ చేస్తున్నారు.

అభిమానులు, సెల‌బ్రిటీలు త్వ‌రగా కోలుకోవాలంటూ సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులంతా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు .తాజాగా తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ట్వీట్ చేశారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, ఇత‌ర భాష‌ల‌లో కొన్ని ద‌శాబ్ధాలుగా తన గాన మాధుర్యంతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసే లెజండ‌రీ సింగర్ బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం త్వ‌ర‌గా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు హ‌రీష్ రావు.

English summary
Balasubrahmanyam is currently being treated by a foreign medical team. Hospital sources said that although his health condition was critical Balasubrahmanyam, who has been suffering from respiratory problems with corona, is on life support in the ICU. Balasubrahmanyam's health information from time to time is also known from the Prime Minister's Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X