వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగం

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతోన్న రైతుల ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్ర ఉందంటూ ఆరోపణలు, విమర్శలు వస్తున్నవేళ.. ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అపఖ్యాతపాలు చేసేందుకు కొన్ని విదేశీ శక్తులు పెద్ద ఎత్తున కుట్రలు పన్నాయని, చివరికి తేయాకుపైనా వాళ్లు పన్నాగాలు రచించారని ప్రధాని తెలిపారు. దేశానికి హాని తలపెట్టిన ఆ శక్తులు, వారికి సహకరిస్తోన్న రాజకీయ పార్టీల జిత్తులకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు.

సచిన్ 'భారతరత్న'కు అనర్హుడు -కొడుకు ఐపీఎల్ ఎంట్రీ కోసమే -కాంగ్రెస్ సంచలనం -పవార్ కూడాసచిన్ 'భారతరత్న'కు అనర్హుడు -కొడుకు ఐపీఎల్ ఎంట్రీ కోసమే -కాంగ్రెస్ సంచలనం -పవార్ కూడా

కుట్రలు బట్టబయలు..

కుట్రలు బట్టబయలు..

కీలక కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాం, వెస్ట్ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. అస్సాంలోని సోనిట్‌పూర్ జిల్లాలో తేయాకు తోటల కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఇండియా బ‌య‌ట నివ‌సిస్తున్న కొంద‌రు వ్య‌క్తులు మ‌న దేశ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీయ‌డానికి కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు. ప్రధానంగా ఇండియ‌న్ చాయ్‌(తేయాకు)ను దెబ్బ‌తీసేలా విశ్వప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక కొన్ని రాజ‌కీయ పార్టీల హ‌స్తం ఉన్న‌ద‌ని ప్రధాని పేర్కొన్నారు. సంబంధిత కుట్రలపై డాక్యుమెంట్ల రూపంలోని ఆధారాలు ఉన్నాయని, కుట్రదారుల నుంచి స‌మాధానాలు రాబ‌డతామని మోదీ చెప్పారు. అంతేకాదు..

తేయాకు కూలీలకు బదులివ్వాలి..

తేయాకు కూలీలకు బదులివ్వాలి..

బ‌య‌టి దేశాల్లో నివసిస్తోన్న కొందరు వ్యక్తులు.. దేశానికి హాని తలపెట్టేలా వ్యవహరిస్తున్నారని, భారతీయ తేయాకు ప్రతిష్టను కూడా దెబ్బతీయడానికి కుట్రలు పన్నారన్న ప్రధాని మోదీ.. ఆ కుట్రదారులు, వారికి సహకరిస్తోన్న రాజకీయ పార్టీలు తేయాకు తోటల కూలీలు, యజమానులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఎవరు ఎన్ని రకాలుగా ఎత్తులు, కుయుక్తులు పన్నినా వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. అస్సాంలోని సోనిట్‌పూర్ జిల్లాలో 'అస్సాం మాలా' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో..

హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దుహౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు

ఎన్నికల వేళ అస్సాం మాలా

ఎన్నికల వేళ అస్సాం మాలా

ఈశాన్య రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన అస్సాంలో ఇంకొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే. షెడ్యూల్ విడుదలకు ముందే కేంద్రం తరఫున ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఈక్రమంలోనే ఆదివారం అస్సాంలోని సోనిట్ పూర్ జిల్లా ధేకియాజులిలో రూ.7,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

అస్సాం మాలాతో రాష్ట్రం రూపరేఖలు మారిపోతాయన్నారు. బిశ్వనాథ్, చారైదేవ్ లలో రెండు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ఆయన.. గువాహటిలో నిర్మిస్తోన్న ఎయిమ్స్ ద్వారా అస్సామీల జీవితాలు మెరుగవుతాయని చెప్పారు. అస్సాంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులను అస్సామీ భాషలోనే చదువుకునేలా ప్రత్యేక కాలేజీలను ఏర్పాటు చేయిస్తామన్నారు.

English summary
amid row over international support for farmers protest continues, Prime Minister Narendra Modi on Sunday said that some people living outside the country are hatching a conspiracy to malign India, and especially the Indian tea. at the ‘Asom Mala’ launch event in Dhekiajuli of Sonitpur district of assam, PM also cited "some documents" and said answers will be sought from those political parties that are behind this conspiracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X