వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: కరోనా ఎఫెక్ట్, భారత్ లో విదేశీయులకు మైండ్ బ్లాక్, ఒక్కసారి కాదు 500 సార్లు, అంతే !

|
Google Oneindia TeluguNews

రిషికేశ్/ హరిద్వార్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. దేశంలో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారి మీద పోలీసులు వివిద సెక్షన్ ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అనవసరంగా రోడ్ల మీద బైక్ ల్లో తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేశారు. అయితే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వస్తున్న విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు తమదైన శైలిలో బుద్ది చెబుతున్నారు. పాము చావకుండా కట్టి వరగకుండా పని జరిగిపోవాలి అనే సామెతను పోలీసులు గుర్తు చేశారు. శ్వేత పత్రం తీసుకు వచ్చి వారి దగ్గర 500 సార్లు మమ్మల్ని క్షమించండి, భారతదేశ నియమాలు ఉల్లంఘించాం, జీవితంలో ఇలాంటి తప్పులు మరోసారి చెయ్యం అంటూ వారి చేత రాయిస్తూ సరికొత్త రీతిలో శిక్షించడంతో వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

భారత్ లో లాక్ డౌన్ దెబ్బ

భారత్ లో లాక్ డౌన్ దెబ్బ

కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం అన్ని జాతీయ రహదారుల్లో సుమారు 3. 5 లక్షలకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో అనవసరంగా రోడ్ల మీద సంచరిస్తున్న ప్రజలకు బుద్ది చెప్పడానికి వారి వాహనాలను అధికారులు సీజ్ చేశారు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

విదేశీ పర్యాటకులు, భక్తులు

విదేశీ పర్యాటకులు, భక్తులు

కరోనా వైరస్ దెబ్బకు భారత్ లో లాక్ డౌన్ అమలు చెయ్యకముందే భారతదేశంలోకి విదేశీ పర్యటకులు చాలా మంది వచ్చారు. లాక్ డౌన్ కు ముందు కొందరు విదేశీయులు వారి దేశాలకు వెళ్లి పోయారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్, హరిద్వార్, బద్రీనాథ్ తదితర ప్రాంతాల్లో కొందరు విదేశీ పర్యటకులు, భక్తులు పర్యటిస్తున్నారు. కరోనా దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయినా విదేశీ పర్యటకులు మాత్రం రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.

విసిగిపోయిన పోలీసులు

విసిగిపోయిన పోలీసులు

లాక్ డౌన్ అమలులో ఉన్నా ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో విదేశీ పర్యటకులు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి లాక్ డౌన్ అమలు చేశారని, మీరు రోడ్ల మీదకు రాకూడదని, మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే కొన్ని రోజులు ఉండాలని విదేశీ పర్యటకులకు రిషికేశ్ పోలీసులు చెప్పారు. అయినా విదేశీయులు పదేపదే బహిరంగ ప్రదేశాల్లోకి రావడంతో స్థానిక పోలీసులు వారికి చెప్పిచెప్పి విసిగిపోయారు.

జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యం !

జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యం !

ఎంత చెప్పినా విదేశీ పర్యాటకులు వినకపోవడంతో పోలీసులకు తిక్కరేగింది. అంతే కొన్ని శ్వేతపత్రాలు (తెల్లకాగితాలు), పెన్నులు తీసుకుని విదేశీయుల దగ్గరకు వెళ్లారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించామని, భారతదేశ చట్టాలను గౌరవిస్తామని, జీవితంలో ఇలాంటి తప్పు మరోసారి చెయ్యమని, మమ్మల్ని క్షమించాలని 500 సార్లు Sorry...Sorry...Sorry... అంటూ వారి చేత రాయిస్తున్నారు.

విదేశీయుల మైండ్ బ్లాక్ !

విదేశీయుల మైండ్ బ్లాక్ !

ఇలా 10 మంది విదేశీయుల చేత Sorry అని 500 సార్లు రాయిస్తున్నారని తెలుసుకున్న మిగిలిన విదేశీయులు ఇప్పుడు వారు ఉంటున్న గదుల నుంచి బయటకు కావడం లేదని రిషికేశ్ కు చెందిన ఓసీనియర్ అధికారి అంటున్నారు. విదేశీయుల దగ్గర తెల్లకాగితాల్లో Sorry, Sorry, Sorry అంటూ పోలీసులు రాయిస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విదేశీయులకు ఇలాగే బుద్ది చెప్పాలని, శభాష్ రిషికేశ్ పోలీస్ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Recommended Video

Fake News Buster : 03 | సెల్ టవర్స్ నుంచి కరోనా వస్తుందా ? | Oneindia Telugu

English summary
Coronavirus: Uttarakhand Police personnel in Rishikesh gave unique punishment to 10 foreigners, who violated COVID-19 lockdown rules. The punishment was to write 'Sorry message' 500 times on a page, later the foreigners were left after warning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X