వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో)

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్ : సింహం.. మ‌‌‌ృగరాజు.. జంతువులకు రారాజుగా ఉంటుంది. సింహం అంటే ఆ ఠీవి, రాజసమే వేరు. ఇక వేటాడే సింహం గడ్డి తినదు అంటారు. అదీ నిజం కూడా .. అడవీలోని జంతుజాలాన్ని చంపుకుతినే మృగరాజు .. గడ్డి తినదు. ఔను మీరు ఔనన్న కాదన్న గడ్డిని ముట్టుకొదు. కానీ గుజరాత్‌లో మాత్రం ఇందుకు విరుద్దమైన ఘటన జరిగింది. అటవీ రారాజు సింహం గడ్డి తినడం కలకలం రేపింది.

గడ్డితిన్న రారాజు ..

గడ్డితిన్న రారాజు ..

సింహం .. ఆ మాటంటేనే జనానికి వణుకు. అటవీకి రాజు అయిన సింహం .. అలాగే ఉంటుంది. కానీ గుజరాత్ గిర్ అడవుల్లో ఓ సింహం మాత్రం తన జాతి పరువు తీసింది. ఇన్నాళ్లు ఉన్న పేరు ప్రతిష్టను దెబ్బతీసింది. గిర్ అటవీలో ఓ మృగరాజు కనిపించింది. వెంటనే ఓ నెటిజన్ వీడియో తీశాడు. అయితే అదీ గడ్డి తినడం ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు వక్తి వీడియో తీసి .. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఈ వీడియో తెగ వైరలవుతుంది.

<strong>టోల్ గేట్ ఛార్జీలు అడిగితే పిడిగుద్దులు.. మహిళ సిబ్బందిపై అటాక్ (వీడియో)</strong> టోల్ గేట్ ఛార్జీలు అడిగితే పిడిగుద్దులు.. మహిళ సిబ్బందిపై అటాక్ (వీడియో)

వేటాడాలే ..

వేటాడాలే ..

సాధారణంగా సింహం .. అడవీలోని చిన్న జంతువులను వేటాడి తింటుంది. అదీ దాని నైజం. కానీ ఓ సింహం ఏకంగా గడ్డి తినడమే ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అటవీ రాజు ఆకలికి తట్టుకోలేకపోయిందని కొందరు .. మరికొందరు జంగల్ కింగ్ గడ్డి తింటుందుని కామెంట్లు పెడుతున్నారు. గడ్డి తిని వాంతి చేసుకొని తన పేగులో ఉన్న మలినాలను శుభ్రం చేసుకుటుందని మరొకరు కామెంట్లు పెడుతున్నారు.

కారణమిదే ..

పర్యావరణం కలుషితం అవడంతో అడవుల్లో జంతువులకు కూడా సరైన ఆహారం లేక కొట్టుమిట్టాడుతున్నాయి. 2016-17లో 200 సింహాలు ఆహారం లేక చనిపోయాయనే నివేదిక ఆందోళన కలిగిస్తోంది. దీనికి గిర్ అభయారణ్యంలో ఓ సింహం గడ్డి తినడం సజీవ సాక్ష్యంగా నిలిచింది. జంతువుల పరిరక్షణపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. జంతువులకు సరైన ఆహార ఏర్పాట్లు కల్పించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
In the forests of Gujarat Gir, a lion has eat grass. Immediately, a netizen video was taken. and post to social media. some one comments on lion ate grass
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X