వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క డిసెంబరు నెలలోనే 7లక్షల ఉద్యోగాలు వచ్చాయి: ఈపీఎఫ్ఓ

|
Google Oneindia TeluguNews

దేశంలో ఉద్యోగాల కల్పన గతేడాది కంటే మూడు రెట్లు పెరిగిందని ఈపీఎఫ్ఓ కార్యాలయం వెల్లడించింది. గత 16 నెలల్లో 7.16 లక్షల ఉద్యోగాలు లభించాయని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి ఉద్యోగాలు పొందిన సంఖ్య 2.37 లక్షలని వివరించింది. సెప్టెంబర్ 2017 నుంచి డిసెంబరు 2018 వరకు సామాజిక భద్రత పథకం కింద 72.32 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని ఈపీఎఫ్ఓ తెలిపింది. గత 16 నెలల్లో ఇన్ని ఉద్యోగాలు కల్పించినట్లు ఈ సంఖ్య స్పష్టం చేస్తోందని వివరించింది. ఇక నవంబర్ 2018కి సంబందించిన పేరోల్ సమాచారంను ఈపీఎఫ్ఓ రివైజ్ చేసింది.

ఇక ఉద్యోగాలు కల్పనకు సంబంధించిన సమాచారం సెప్టెంబర్ 2017 నుంచి నవంబర్ 2018 వరకు పొందుపర్చింది. 65.15 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడిచేసింది. అంతకుముందు 73.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ ఆ అంచనా లెక్క తప్పింది. ఇక మార్చి 2018కి వేసిన అంచనా మాత్రం కరెక్ట్ అయ్యింది. మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన సంఖ్య తగ్గుముఖం పట్టిందని వివరించింది. డిసెంబర్ 2018లో 2.17 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అది కూడా 18 నుంచి 21 ఏళ్ల వయసున్న వారికే కల్పించడం జరిగిందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఇక 22 నుంచి 25 ఏళ్ల వయసున్న వారికి 2.03 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది.

Formal sector jobs touch 16-month high at 7.16 lakh in December:EPFO payroll data

2018 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ఓ పేరోల్ డేటాను విడుదల చేస్తోంది. కొత్తగా నమోదవుతున్న యూనివర్శల్ అకౌంట్ నెంబరు ఆధారంగా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో లెక్కగడుతోంది ఈపీఎఫ్ఓ. ఇక ఉద్యోగులకు సంబంధించిన సమాచారం నిరంతరం అప్‌డేట్ అవుతుందని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. ఇక వయస్సు ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను లెక్కకడుతున్నట్లు చెప్పిన ఈపీఎఫ్ఓ ఇందులో తాత్కాలిక ఉద్యోగస్తుల వివరాలు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేసింది. తాత్కాలిక ఉద్యోగుల వివరాలు ఏడాది మొత్తం ఉండకపోవచ్చని పేర్కొంది. ఇక ఉద్యోగుల సమాచారం తమ ఆధార్ సంఖ్యతో అనుసంధానమై ఉంటాయని వివరించింది.

English summary
Employment generation in the formal sector almost trebled to touch a 16-month high of 7.16 lakh in December 2018 compared to 2.37 lakh in the year-ago month, according to the latest EPFO payroll data. Around 72.32 lakh new subscribers were added to social security schemes of the Employees' Provident Fund Organisation (EPFO) from September 2017 to December 2018, the data showed. This indicates that these many jobs were created in the last 16 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X