వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య..కోలుకోవాలని మమత ఆకాంక్ష..

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దాదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. భట్టాచార్య అనారోగ్యంపై గవర్నర్, సీఎం స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇరువురు ఆకాంక్షించారు.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో బుద్దదేవ్ భట్టాచార్య ఆస్పత్రిలో చేరారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అతను త్వరగా కోలుకోవాలని ఆమె కోరారు. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ కూడా భట్టాచార్య త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. భట్టాచార్యకు ప్రైవేట్ ఆస్పత్రి ప్లూ క్లినిక్‌లో వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నారు.

Former Bengal CM Buddhadeb Bhattacharya hospitalised..

భట్టాచార్యకు అవసరమైన పరీక్షలు చేస్తున్నామని ప్లు క్లినిక్ వైద్యులు తెలిపారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమబెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. శ్వాసకోస ఇబ్బందులతోపాటు.. ఇతర సమస్యలు భట్టాచార్యకు ఉన్నాయి. వృద్దాప్యంలోకి రావడంతో సహజంగానే ఇతర సమస్యలు కూడా వస్తాయి. క్రమంగా సీపీఎం పార్టీ క్రియాశీల పదవులకు భట్టాచార్య దూరంగా ఉంటూ వస్తున్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు, సీపీఎం పొలిట్ బ్యూరో నుంచి 2018లో వైదొలిగారు. ఇక అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

English summary
West Bengal former Chief Minister Buddhadeb Bhattacharya who was hospitalised today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X