వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీపై మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ , రంగంలోకి దింపిన మహాఘట్‌బంధన్

|
Google Oneindia TeluguNews

భద్రతాబలగాల ఉదంతాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్దిపోందాలని చూస్తున్నారని ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రధాని మోదీ కి, యూపిలోని మహాఘట్ బంధన్ గట్టి పోటి ఇచ్చేందుకు సిద్దమయింది. ఈనేపథ్యంలోనే మోది ప్రచారం చేస్తున్న భద్రతా దళాల అంశాన్ని తిప్పి కొట్టేందుకు అదే భద్రతా బలగాలకు చెందిన వ్యక్తిని పోటిలోకి దింపింది . దీంతో వారణాసి లో గతంలో ప్రకటించిన అభర్థిని కాదని తాజాగా బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ అయిన తేజ్ బహదూర్ యాదవ్ సమాజ్‌వాది పార్టీ నుండి రంగంలోకి దింపింది.

వారణాసి లో మోదీకి గట్టి పోటి అభ్యర్థిని మార్చిన మహఘట్‌‌బంధన్

వారణాసి లో మోదీకి గట్టి పోటి అభ్యర్థిని మార్చిన మహఘట్‌‌బంధన్

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి పోటి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడికి గట్టి పోటి ఇచ్చేందుకు సమాజ్‌వాది పార్టీ మరో పావు కదిపింది. ప్రధానిపై పోటికి షాలిని యాదవ్ అనే అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే మోదీపై పట్టు సాధించేందుకు తాను ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చింది. తాజగా మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహుదూర్ యాదవ్ ను పోటిలోకి దింపింది.కాగా తేజ్ బహుదూర్ యాదవ్ స్వంతంత్ర అభ్యర్థిగా పోటి చేయాలని భావించారు. దీంతో నామినేషన్ సైతం వేశారు. అయితే అకస్మాత్తుగా రాజకీయ ఎత్తుగడలు మారాయి. నామినేషన్ వేసిన తేజ్ దీప్ బహదూర్ యాదవ్ తాను సమాజ్ వాదీ పార్టీ నుండి పోటి చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఆయన ప్రకటించిన వెంటనే ఎస్పి సైతం తన పాత అభ్యర్థిని మార్చుతున్నట్టు ప్రకటించింది.

ఎవరు ఈ తేజ్ బహదూర్ యాదవ్

ఎవరు ఈ తేజ్ బహదూర్ యాదవ్

గతంలో తేజ్ బహదూర్ యాదవ్ భారత బలగాల ఆహర వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ -పాక్ సరిహద్దు ప్రాంతాలైన జమ్ము కశ్మీర్ లోని ఆర్మీ క్యాంపుల్లో జవాన్లకు సరైన అహరం అందించడం లేదని , అహరం కూడ సరిగా ఉండడం లేదని ఆరోపణలు చేయడంతోపాటు జవాన్లకు కేటాయించిన ఆహర పదార్థాలను అధికారులు అక్రమంగా అమ్ముకుంటున్నారని పలు ఆరోపణలు చేస్తూ నాలుగు వీడియో తీశాడు. ఆ వీడియోలను తన ఫేస్ బుక్ తోపాటు ఆన్‌లైన్ లో పెట్టాడు. దీంతో ఆ వీడియోలు కలకలం రేపాయి.

విచారణ చేపట్టిన బీఎస్ఎఫ్ , అనంతరం జవాన్ తొలగింపు

విచారణ చేపట్టిన బీఎస్ఎఫ్ , అనంతరం జవాన్ తొలగింపు

కాగా తీవ్ర దుమారం రేపిన వీడియోలపై బీఎస్ఎఫ్ అధికారులు తేజ్ బహదూర్ చేసిన ఆరోపణలపై విచారణ చెపట్టింది. అయితే విచారణలో తేజ్ బహదూర్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. దీంతో ఆయన్ను 2017 లో విధుల నుండి తొలగించింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుండి అజయ్ రాయ్ , మహఘట్ బంధన్ నుండి తేజ్ బహదూర్ యాదవ్ ల నుండి పోటి ఎదుర్కోనున్నారు మోడి, ఇక చివరి దశ అయిన మే 19 న యూపి వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Samajwadi Party (SP) on Monday fielded sacked Border Security Force (BSF) constable Tej Bahadur Yadav as the mahagathbandhan’s candidate from Varanasi Lok Sabha constituency. The former BSF jawan has replaced Shalini Yadav as SP-BSP-RLD candidate to take on PM Narendra Modi and Congress’ Ajay Rai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X