• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అందిన‌ట్టే అంది..! అధికారం కోసం మ‌హారుద్ర‌యాగం చేయ‌బోతున్న మాజీ ముఖ్య‌మంత్రి!

|

బెంగ‌ళూరు: పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం ఎంత‌కీ తెగ‌ట్లేదనే ఆందోళ‌న అక్క‌డి భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల్లో నెల‌కొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ ప్ర‌భుత్వం ప‌త‌నం అంచుల‌కు చేరుకున్న‌ప్ప‌టికీ.. క్ర‌మంగా నిల‌దొక్కుకుంటోంద‌నే ఆవేద‌న క‌ర్ణాట‌క బీజేపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మిలో నెల‌కొన్న ప్ర‌కంప‌న‌లు నిదానంగా స‌ర్దుకుంటున్నాయ‌ని బీజేపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే ప‌రిస్థితి మ‌రి కొద్దిరోజుల పాటు గ‌న‌క కొన‌సాగితే- కుమార‌స్వామి స‌ర్కార్‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ ఉండ‌ద‌ని వాపోతున్నారు క‌మ‌ల‌నాథులు.

ఈ నేప‌థ్యంలో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డానికి దేవుళ్ల మీద భారం వేస్తున్నారు. తాజాగా- బీజేపీ రాష్ట్ర‌శాఖ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప మ‌హారుద్ర‌యాగం చేయాల‌ని సంక‌ల్పించారు. అధికారాన్ని చేజిక్కించుకోవ‌డానికి మ‌హారుద్ర‌యాగాన్ని చేయాలని నిర్ణ‌యించుకున్నారు. ఈ యాగం వ‌ల్ల కొన్ని ర‌కాల అడ్డంకులు తొల‌గిపోతాయ‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. బెంగ‌ళూరు కెంపేగౌడ న‌గ‌రలోని ప్ర‌ఖ్యాత గ‌వి గంగాధ‌రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఈ మ‌హారుద్ర‌యాగాన్ని నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

former Chief Minister of Karnataka Yeddyurappa all set to doing Maharudrayaga for power

ఈ ఆల‌యంలో భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉండే అవ‌కాశం ఉన్నందున‌..య‌డ్యూర‌ప్ప స్వ‌స్థ‌లంలోనైనా ఈ యాగాన్ని నిర్వ‌హించే అవ‌కాశాలు లేక‌పోలేదు. గ‌వి గంగాధ‌రేశ్వ‌ర ఆల‌యంలో కుద‌ర‌క‌పోతే య‌డ్యూర‌ప్ప స్వ‌గ్రామం మండ్య జిల్లాలోని బుక‌న‌కెరెలో దీన్ని నిర్వ‌హించాల‌ని యోచిస్తున్నారు. చంద్ర‌గ్ర‌హ‌ణం ప‌రిస‌మాప్త‌మైన వెంట‌నే అంటే బుధ‌వారం తెల్ల‌వారు జామున 3 నుంచి 4 గంట‌ల మ‌ధ్య కాలంలో ఈ మ‌హారుద్ర‌యాగం నిర్వ‌హించబోతున్న‌ట్లు స‌మాచారం. దీనికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్ల‌ను య‌డ్యూరప్ప పూర్తి చేశార‌ని అంటున్నారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃస‌మీక్ష‌పై వ‌ణుకెందుకు? సాయిరెడ్డి

దేవేగౌడ నివాసంలో పూజ‌లు

అధికార సంక్షోభాన్ని చ‌వి చూస్తోన్న క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి కుమార‌స్వామి సైతం త‌న నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. త‌న కుమారుడి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఎలాంటి ముప్పూ రాకూడ‌ద‌ని కోరుకుంటూ దేవేగౌడ ఈ పూజ‌ల‌ను నిర్వ‌హించారు. బెంగ‌ళూరులోని జేపీ న‌గ‌ర, ప‌ద్మ‌నాభ న‌గ‌ర‌ల్లో ఉన్న దేవేగౌడ‌, కుమార‌స్వామి సొంత నివాసాల్లో ఈ పూజ‌లను శాస్త్రోక్తంగా ముగించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Chief Minister of Karnartaka and Bharateeya Janata Party State President BS Yeddyurappa has all set to made Maharudrayaga for the Power in the State. The Maharudrayaga is made in Gavi Gangadhareshwara temple in Bengaluru or his native place Bukanakere in Mandya District on early hours of Wednesday, source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more