బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ సీఎంతో సహ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అరెస్టు !

కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్, చేనేత కార్మిక శాఖ మంత్రి రమేష్ జారకిహోళి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను బెంగళూరు పోలీసులు అరెస

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్, చేనేత కార్మిక శాఖ మంత్రి రమేష్ జారకిహోళి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుడు, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధక్షుడు బీఎస్. యడ్యూరప్పతో సహ బీజేపీ నాయకులు అందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ కర్ణాటక మంత్రులు డీకే. శివకుమార్, రమేష్ జారకిహోళిల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

Former CM and BJP leaders arrested-while protests in Bengaluru

ప్రజలను లూటీ చేసి మంత్రులు డీకే. శివకుమార్, రమేష్ జారకిహోళి అక్రమంగా డబ్బు, ఆస్తులు సంపాధించారని ఆరోపిస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు బెంగళూలోని ఫ్రీడం పార్క్ లో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం బీజేపీ నాయకులు అందరూ విదానసౌధ ముట్టడించడానికి ర్యాలీగా బయలుదేరారు.

రేస్ కోర్స్ రోడ్డు దగ్గరకు చేరుకున్న సమయంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సందర్బంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ర్యాలీ నిర్వహిస్తామని బీఎస్. యడ్యూరప్ప పట్టుబట్టారు.

తరువాత మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, మాజీ హోం శాఖ మంత్రి ఆర్. అశోక్, ఎంపీ శోభాకరందాజ్లే, ఎమ్మెలు అరవింద్ లింబావలి, రఘ తదితర ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్ల పాటు వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. తన మీద ఏసీబీతో కేసులు పెట్టించిన సీఎం సిద్దరామయ్యను తాను వదిలిపెట్టనని బీఎస్, యడ్యూరప్ప హెచ్చరించారు.

English summary
BJP leaders arrested while protests at freedom park Bengaluru , on August 18th, for seeking resignation of DK Shivakumar and Ramesh Jharkiholi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X