వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేట్, టైం ఫిక్స్ చెయ్యి వస్తా. సామ్రాట్ వంశమా, బంగారు కుర్చీ, బళ్లారి రెడ్డికి చాలెంజ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. డేట్, టైం ఫిక్స్ చెయ్యి బహిరంగ చర్చకు వస్తానని, మీరు ఏమైనా సామ్రాట్ వంశానికి చెందిన వారా ? అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య బళ్లారి గాలి జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు.

నా జీవితం నాశనం చేశారు, మాజీ సీఎంకు మానం మర్యాద లేదు: గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!నా జీవితం నాశనం చేశారు, మాజీ సీఎంకు మానం మర్యాద లేదు: గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!

ప్రత్యక్ష రాజకీయాలకు చాలకాలంగా దూరంగా ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దరామయ్య స్వార్థ రాజకీయాలకు తన జీవితం నాశనం అయ్యిందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

మీ పాపాలు చెప్పారు

మీ పాపాలు చెప్పారు

సిద్దరామయ్య స్వార్థరాజకీయాలకు తాను నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించానని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై మాజీ సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ మీరు చేసిన పాపాలపై మీ సొంత పార్టీ ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహా రాసిన పుస్తకంలో ఏమిఉందో చదవాలి అంటూ ఆపుస్తకం చిత్రాన్ని సిద్దరామయ్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

టైం, డేట్ ఫిక్స్ చేసుకో !

టైం, డేట్ ఫిక్స్ చేసుకో !

బళ్లారిలో సంచరించడానికి మీకు నిశేధం విధించారు. అక్రమ మైనింగ్ పై చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నాను, డేట్, టైం మీరే ఫిక్స్ చేసుకుని సమాచారం ఇవ్వండి, అక్రమ మైనింగ్ పై బహిరంగంగా చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని మాజీ సీఎం సిద్దరామయ్య వరుసగా ట్వీట్ట్ చేసి గాలి జనార్దన్ రెడ్డికి సవాలు విసిరారు. గాలి జనార్దన్ రెడ్డితో చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని, వెనక్కివెళ్లనని సిద్దరామయ్య అన్నారు.

సామ్రాట్ వంశమా ?

సామ్రాట్ వంశమా ?


బంగారు కుర్చీ, బంగారు సామాగ్రీలు గాలి జనార్దన్ రెడ్డి విలాసవంతమైన జీవితానికి సాక్షం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఏమైనా సామ్రాట్ వంశానికి చెందిన వారా ? అంటూ సిద్దరామయ్య ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ తో వీటిని సంపాధించారని బళ్లారితో పాటు దేశం మొత్తం తెలుసు. ఇంత జరిగినా తాను నిజాయితీ పరుడు అని గాలి జనార్దన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ సిద్దరామయ్య వరుసగా ట్వీట్ చేశారు.

మీరు ఏం చేశారు ?

మీరు ఏం చేశారు ?

గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, గాలి కరుణాకర్ రెడ్డి మంత్రులుగా పనిచేసినా బళ్లారి జిల్లా ప్రజలకు ఎలాంటి న్యాయం చెయ్యలేదని సిద్దరామయ్య ఆరోపించారు. నాయక్ (వాల్మీకి)లను ఎస్టీల్లో చేర్చడానికి 1991లో అప్పటి లోక్ సభ సభ్యుడుగా ఉన్న హెచ్.డి. దేగేగౌడ, వీఎస్. ఉగ్రప్ప తీవ్రస్థాయిలో పోరాటం చేశారని, అందు వలనే నేడు శ్రీరాములు ఎస్టీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయం వారు గుర్తు పెట్టుకోవాలని సిద్దరామయ్య గుర్తు చేశారు.

సవాలు గుర్తుందా !

సవాలు గుర్తుందా !

లోకాయుక్త సంతోష్ హెగ్డే నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో పాదయాత్రతో బళ్లారికి రావాలని గాలి జనార్దన్ రెడ్డి సవాలు చేశారని, ఆయన సవాలు స్వీకరించి తాను బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్ర నిర్వహించానని సిద్దరామయ్య గుర్తు చేశారు. బళ్లారికి తాను పాదయాత్ర చేసిన తరువాత రెడ్డి గ్యాంగ్ ఎర్పాటు చేసిన బళ్లారి రిపబ్లిక్ కుప్పకూలిపోయిందని సిద్దరామయ్య అన్నారు.

నా తంటకు రావద్దు

నా తంటకు రావద్దు


గాలి జనార్దన్ రెడ్డి సామ్రాజ్యం కుప్పకూలిపోయిన తరువాత ఆయన జైలుకు వెళ్లారని సిద్దరామయ్య అన్నారు. తనను పదేపదే రెచ్చగొడితే బెయిల్ రద్దు అయ్యి మళ్లీ జైలుకు వెళ్లవలసి ఉంటుందని గాలి జనార్దన్ రెడ్డిని సిద్దరామయ్య హెచ్చరించారు. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికలు నవంబర్ 3వ తేదీ జరగనున్న నేపథ్యంలో ఆ జిల్లాలో రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి.

English summary
Ballari by election 2018: Former Chief Minister counter made open challenge to Gali Janardhan Reddy to discuss on Mining corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X