వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిల్మ్ సిటీ షిఫ్ట్, సీఎం, మాజీ సీఎం వార్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ప్రతీకారం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మైసూరులోని స్యాండిల్ వుడ్ చిత్రనగరిని అక్కడి నుంచి తరలించే విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య అభిప్రాయవిభేదాలు మొదలైనాయి. ఈ విషయంపై సిద్దరామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం కుమారస్వామికి లేఖ రాశారు.

చిరకాల కోరిక

చిరకాల కోరిక

మైసూరు నగరంలో చిత్ర నగరి ఏర్పాటు చెయ్యాలని చాలకాలం నుంచి డిమాండ్లు వస్తున్నాయని, స్యాండిల్ వుడ్ చిరకాల కోరిక అదే అని సిద్దరామయ్య కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామికి రాసిన లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగు, తమిళ్, హిందీ

తెలుగు, తమిళ్, హిందీ

మైసూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కన్నడతో సహ తెలుగు, తమిళ్, హిందీ తో పాటు అనేక భాషల చిత్రాల షూటింగ్ జరుగుతుంటుందని సిద్దరామయ్య గుర్తు చేస్తున్నారు. మైసూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ లు చెయ్యడానికి చిత్రరంగ ప్రముఖులు చాలకాలం నుంచి ఆసక్తి చూపిస్తున్నారని సిద్దరామయ్య సీఎం కుమారస్వామికి రాసిన లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

వంద ఎకరాలు, నిధులు

వంద ఎకరాలు, నిధులు

మైసూరు నగరం నుంచి చిత్రనగరిని రామనగరకు తరలించడానికి మాజీ సీఎం సిద్దరామయ్య అభ్యంతంరం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మైసూరులో చిత్రనగరి ఏర్పాటు చెయ్యడానికి 100 ఏకరాల భూమి మంజూరు చేసిందని, బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించిందని, కుమారస్వామి ప్రభుత్వం బడ్జెట్ లో రామనగరకు నిధులు కేటాయించలేదని సిద్దరామయ్య గుర్తు చేశారు.

మొదటి స్టూడియో

మొదటి స్టూడియో

1945 నుంచి మైసూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయని సిద్దరామయ్య అంటున్నారు. మొదటిసారి నవజ్యోతి స్టూడియో మైసూరులో ఏర్పాటు చేశారని, అనేక మంది కళాకారులు, టెక్నీషియన్లు అదే స్టూడియో నుంచి బయటకు వచ్చారని సిద్దరామయ్య అంటున్నారు.

16 ప్యాలెస్ లు, 250 లోకేషన్లు !

16 ప్యాలెస్ లు, 250 లోకేషన్లు !

మైసూరులో 16 ప్యాలెస్ లు, 250కు పైగా అందమైన లోకేషన్లు, నది కాలువలు, సుందరమైప కొండలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయని, విమాన సౌకర్యం ఉందని సిద్దరామయ్య అంటున్నారు. మైసూరులో చిత్రనగరి ఏర్పాటు చెయ్యాలని కన్నడ కఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ఎంతో ఆశపడిన విషయం ఇదే సందర్బంలో గుర్తు చేసిన సిద్దరామయ్య రామనగరకు చిత్రనగరిని తరలించే విషయంలో మరోసారి ఆలోచించాలని సీఎం కుమారస్వామికి లేఖ రాశారు.

English summary
Congress legislature party leader Siddaramaiah has strongly objected to shift film city from Mysore to Ramanagar. He has written a letter to chief minister H.D.Kumaraswamy and urged rethink about the earlier decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X