వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దురంహకారం లేదు, తనది గ్రామీణ బాష, ఎల్ఎల్ బీ తనను సీఎం చేసింది: సిద్దరామయ్య!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తాను నేరుగా మాట్లాడితే దురంహకారి అంటారని, అలా అనుకునే వారి గురించి తాను పట్టించుకోనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. తనను దురంహకారి అనుకునే వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సిద్దరామయ్య చెప్పారు. మైసూరులోని కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో సిద్దరామయ్య మాట్లాడారు.

గ్రామీణ బాష

గ్రామీణ బాష

తనది గ్రామీణ బాష, మాట్లాడితే ముఖం మీద కొట్టినట్లు ఉంటుంది, కొందరికి అది నచ్చదు అని సిద్దరామయ్య అన్నారు. ఎదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అది కొందరికి నచ్చదని, తాను ఏమీ చెయ్యలేనని సిద్దరామయ్య వివరించారు. ఎవరైతే ముక్కుసూటిగా ఉంటారో వారికి నా మాటలు అర్థం అవుతాయని, దాగుడుమూతలు ఆడేవారికి తన మాటలు వక్రీకరించినట్లు ఉంటుందని సిద్దరామయ్య అన్నారు.

ఆత్మాభిమానం

ఆత్మాభిమానం

కొన్ని జాతుల వారు, పేదవారు ఆత్మాభిమానం వదిలిపెడితే గులాంగిరి చెయ్యాల్సి వస్తుందని సిద్దరామయ్య అన్నారు.తాను మూడవిశ్వాసాలను దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే చాల మంది తనను విమర్శించారని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. మూడ నమ్మకాల నిషేద చట్టం తాను తీసుకువచ్చానని సిద్దరామయ్య గుర్తు చేశారు. మూడనమ్మకాలను వ్యతిరేకిస్తే తాను లింగాయుతులకు వ్యతిరేకం అని ప్రచారం చేశారని సిద్దరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంగ్ల బాష వద్దు

ఆంగ్ల బాష వద్దు

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బాషను ప్రవేశ పెట్టడానికి తాను పూర్తిగా వ్యతిరేకిస్తానని సిద్దరామయ్య అన్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఆంగ్ల బాష మీద వ్యామోహం ఎక్కువ అయ్యిందని సిద్దరామయ్య ఆరోపించారు. విద్యార్థులు మాతృబాషలో విద్యాభ్యాసం చేస్తే ఉపయోగం ఉంటుందని సిద్దరామయ్య అన్నారు. విద్యార్థులు మాతృబాషలో విద్యాభ్యాసం చేస్తే వారికి భవిష్యత్తు ఉంటుందని చాల మంది మేధావులు చెప్పారని సిద్దరామయ్య గుర్తు చేశారు.

నేనే టాప్ ర్యాంకర్

నేనే టాప్ ర్యాంకర్

ఇదే సమయంలో సిద్దరామయ్య ఆయన విద్యాభ్యాసం గురించి గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో 10వ తరగతి వరకు తానే టాప్ ర్యాంకర్ అని సిద్దరామయ్య అన్నారు. తరువాత పీయూసీ (ఇంటర్)లో సైన్స్ తీసుకున్నానని, సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యి బీఎస్సీ పూర్తి చేశానని సిద్దరామయ్య చెప్పారు. బీఎస్సీ పూర్తి చేసిన తరువాత సొంత ఊరిలో ఒక సంవత్సరం వ్యవసాయం చేశానని సిద్దరామయ్య వివరించారు.

ఎల్ఎల్ బీ సీఎం చేసింది

ఎల్ఎల్ బీ సీఎం చేసింది

ఊరిలో వ్యవసాయం చేసిన తరువాత ఎల్ఎల్ బీ పూర్తి చేశానని సిద్దరామయ్య అన్నారు. ఎల్ఎల్ బీ చెయ్యకుంటే తాను సీఎం అయ్యే అవకాశం ఉండేదికాదని ఇదే సందర్బంలో సిద్దరామయ్య చెప్పారు. తనకు ఎంబీబీఎస్ చెయ్యాలని ఎంతో ఆశ ఉండేదని, అది కుదరలేదని సిద్దరామయ్య అన్నారు.

English summary
Siddaramaiah said I am a stright talker so some people call me i have attitude. He talked in Mysuru and said some people brand as anti hindu for bringing anti superstition bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X