వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యం : కొడుకే కాదన్నాడు, ఆయన కోసం పార్టీ మారాడు

మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ గవర్నర్ ఎన్ డి తివారీ తన కొడుకు శేఖర్ తో కలిసి బిజెపలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఒకప్పుడు అతను తన కొడుకే కాదన్నాడు. కాని, ఆ కొడుకు కోసమే ప్రస్తుతం ఆయన ఇంతకాలం ఉన్న పార్టీని వీడాడు. తన కొడుకు శేఖర్ బుదవారం నాడు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో వారిద్దరూ బిజెపిలో చేరారు.కాంగ్రెస్ పార్టీలో ఎన్ డి తివారీ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు.ఉత్తర్ ప్రదేశ్, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన గవర్నర్ గా కూడ పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఎన్ డి తివారీ బుదవారం నాడు బిజెపిలో చేరాడు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ గవర్నర్ తో పాటు పలు కీలకమైన పదవులు నిర్వహించారు ఎన్ డి తివారీ.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో ఈ రాష్ట్రానికి ఎన్ డి తివారీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఈ రాష్ట్రం నుండి ఎన్ డి తివారీ తనయుడు శేఖర్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడు.

ఈ మేరకు ఎన్ డి తివారీ తనయుడు శేఖర్ తో కలిసి బుదవారం నాడు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఎన్ డి తివారీ బిజెపిలో చేరారు.

తనయుడే కాదన్నాడు, బిజెపిలో చేరాడు

తనయుడే కాదన్నాడు, బిజెపిలో చేరాడు

ఎన్ డి తివారీ కాంగ్రెస్ పార్టీలో కీలకనాయకుడుగా ఉన్నాడు.శేఖర్ తన కొడుకు కాదన్నాడు ఎన్ డి తివారీ. ఎన్ డి తివారీ తన తండ్రి అంటూ శేఖర్ కోర్టులను ఆశ్రయించాడు.అయితే తివారీపై న్యాయపోరాటం చేసి శేఖర్ విజయం సాధించాడు. రోహిత్ శేఖర్ ,ఎన్ డి తివారీ డిఎన్ఏ పరీక్షలు సరిపోయాయి.తొలుత శేఖర్ తో కాని, ఆమె తల్లితో కాని,ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తివారీ చివరకు శేఖర్ ను కొడుకుగా ఒప్పుకొన్నాడు.శేఖర్ తో కలిసి ఆయన బిజెపిలో చేరాడు.

ఎవరీ శేఖర్?

ఎవరీ శేఖర్?

రోహిత్ శేఖర్ నిన్నమొన్నటి వరకు ఈ పేరు ప్రముఖంగా విన్పించేది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా ఎన్ డి తివారీ ఉన్న కాలంలోనే హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. రోహిత్ శేఖర్ తల్లి ఉజ్వల శర్మ కూడ అలుపులేకుండా పోరాటం చేసింది. చిట్టచివరకు ఎన్ డి తివారి శేఖర్ తన కొడుకు అని ఒప్పుకొన్నాడు.తొలుత ఈ విషయాన్ని రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని ఆరోపించాడు తివారీ,చివరకు శేఖర్ తన కొడుకే అని ఒప్పుకొన్నాడు.

రాజకీయాల్లో శేఖర్ చేరేందుకు తివారీ కృషి

రాజకీయాల్లో శేఖర్ చేరేందుకు తివారీ కృషి

తన తనయుడు శేఖర్ ను రాజకీయాల్లో వారసుడిగా చూసేందుకు తివారీ ప్రయత్నించారు. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్టు కోసం తివారీ ప్రయత్నించారు. అయితే ఆది ఫలించలేదు. దీంతో ఆయన ఉత్తరాంఖండ్ లో బిజెపి అభ్యర్థిగా శేఖర్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కొడుకు కోసం బిజెపిలో చేరాడు తివారీ.

సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న ఎన్ డి తివారీ

సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న ఎన్ డి తివారీ

సుదీర్ఘకాలం పాటు ఎన్ డి తివారీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 1986 నుండి 1987 మద్య కాలంలో రాజీవ్ గాంధీ క్యాబినెట్ లో తివారీ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు కీలకపదవులు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ కు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన గవర్నర్ గా పనిచేశారు.సోనియాతో విబేధించి తివారీ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ పార్టీని తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడాయన.

English summary
former united anhdrapradesh governor n.d. tiwari and his son rohit shekar joined in bjp on wednesday. sheakar will contest from uttarakhand state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X