వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత హమీలు, సిద్దూ పంజాబ్ లో కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?

పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల విడుదలైంది,.అధికారంలో ఉన్న అకాలీదళ్, బిజెపి కూటమి దూసుకుపోతోంది. కాని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పంజాబ్ :పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల విడుదలైంది,.అధికారంలో ఉన్న అకాలీదళ్, బిజెపి కూటమి దూసుకుపోతోంది. కాని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాందీ పంజాబ్ నాయకులతో చర్చించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి ముందుగా సిద్దూతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ చర్చించనున్నారు.

పంజాబ్ ఎన్నికల్లో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది.అయితే అధికార కూటమిపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివచ్చేలా ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంతో ఉంది. దరిమిలా తమతో కలిసి వచ్చే శక్తులను కూడ ఆ పార్టీ కలుపుకొని పోతోంది.

బిజెపికి రాజీనామా చేసిన తర్వాత తొలుత ఆప్ లో చేరుతారని మాజీ క్రికెటర్ సిద్దూపై ప్రచారం సాగింది.అయితే ఆప్ ను కాదని, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సిద్దూ సతీమణి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు.

సిద్దూతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ చర్చించిన తర్వాతే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరిక కాంగ్రెస్ కు ప్రయోజనమేనా?

సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరిక కాంగ్రెస్ కు ప్రయోజనమేనా?

మాజీ క్రికెటర్ సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది.అయితే పార్టీలో చేరేముందు తన డిమాండ్లను ఆయన పార్టీ ముందుకు తీసుకురానున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిద్దూను ఉపముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చిందని పార్టీ లో ప్రచారం సాగుతోంది. దీనికితోడు సిద్దూ కొరిన స్థానాలను కూడ ఇచ్చే విషయమై పీటముడి కొనసాగుతోంది. సుమారు 18 అసెంబ్లీ స్థానాలను సిద్దూ కోరుతున్నాడని సమాచారం అయితే సిద్దూ కోరినన్ని స్థానాలను ఇచ్చేవిషయమై కొంత ఆలోచనలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయమై సిద్దూతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు.

ఉచిత హమీలతో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో

ఉచిత హమీలతో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో

ఈ దఫా పంజాబ్ రాష్ట్రంలో అదికారంలోకి రావాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఏర్పాటుచేసుకొంది. ఈ మేరకు ఉచిత హమీలను ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో చేర్చింది. ఉచితంగా ఇళ్ళు, పాఠ్యపుస్తకాలతో పాటు పలు ఉచిత వాగ్దాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఉచిత వాగ్ధానాలను చూసిన అధికారి అకాలీదళ్, బిజెపి సంకీర్ణం తమ మ్యానిఫెస్టోల్లో మరిన్ని ఉచిత వాగ్ధానాలను ప్రకటించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఆప్ ను సిద్దూ ఎందుకు వద్దనుకొన్నారు

ఆప్ ను సిద్దూ ఎందుకు వద్దనుకొన్నారు

బిజెపికి గుడ్ బై చెప్పిన తర్వాత ఆప్ లో మాజీ క్రికెటర్ చేరుతారనే ప్రచారం సాగింది. ఆప్ లో చేరాలని సిద్దూను ఆ పార్టీ నాయకులు కూడ కోరారు.అయితే బిజెపి నాయకుల తీరుపై అసంతృప్తిగా ఉన్న సిద్దూ తనకు సరైన రాజకీయ వేదిక అవసరమని భావించాడు. కొత్త పార్టీ ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని భావించాడు. ఆప్ కూడ సిద్దూ కోరినన్నీ సీట్లు ఇచ్చేందుకు కూడ అంగీకరించింది. పంజాబ్ అసెంబ్లీలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి.అయితే ఈ అసెంబ్లీ సిద్దూ సగానికి పైగా సీట్లను సిద్దూ సూచించిన వారికే ఇచ్చేందుకు కూడ ఆప్ సిద్దమైందని సమాచారం.అయితే కాంగ్రెస్ పార్టీ బంఫర్ ఆఫర్ ప్రకటించడంతో ఆప్ ను కాదనుకొన్నాడని చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతామని కాంగ్రెస్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ వైపుకు సిద్దూ మొగ్గుచూపాడని చెబుతున్నారు.

అమృత్ సర్ పార్లమెంట్ స్థానం కూడ కోరుతున్న సిద్దూ

అమృత్ సర్ పార్లమెంట్ స్థానం కూడ కోరుతున్న సిద్దూ

ప్రస్తుతం అమృత్ సర్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుండి సిద్దూ పోటీచేసే అవకాశాలున్నాయి. ఈ స్థానంతో పాటు సిద్దూ సతీమణికి కూడ మరో అసెంబ్లీ స్థానం ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలను కూడ సిద్దూ కోరుతున్నాడని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అమృత్ సర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే ఆసక్తిని కూడ సిద్దూ చూపుతున్నారు. ఈ ఆసక్తిని పురస్కరించుకొని అమృత్ సర్ పార్లమెంట్ స్థానం కూడ సిద్దూ కోరుతున్నట్టు సమాచారం. ఈ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ తీరిస్తే సిద్దూ ఆ పార్టీలో వెంటనే చేరిపోనున్నారు.

English summary
former cricketer sidhu will be join in congress party , congress party fufill his demands before joining congress party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X