వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఇన్నింగ్స్: బిజెపిలో చేరిన శ్రీశాంత్, ఎమ్మెల్యేగా పోటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెట్‌ ఆటగాడు ఎస్‌ శ్రీశాంత్‌ భారతీయ జనతా పార్టీ చేరారు. ఈ మేరకు శ్రీశాంత్‌ను తమ పార్టీలో చేర్చుకున్నట్లు శుక్రవారం బిజెపి అధికారికంగా ప్రకటించింది.

కాగా, కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం శాసనసభ స్థానం నుంచి ఆయన పోటీచేస్తున్నట్లు బిజెపి పేర్కొంది. దాదాపు నాలుగు గంటల సమావేశం అనంతరం శ్రీశాంత్‌ను పార్టీలో చేర్చుకుంటున్నట్లు బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ప్రకటించింది. అంతేగాక, మరికొందరు సినీతారలు కూడా బిజెపి నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపింది.

Thiruvananthapuram

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్ పేరును న్యాయస్థానం గతేడాది తొలగించిందని, దీనిపై ప్రతిపక్షాలు చేసే విమర్శలతో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేసింది.

ఢిల్లీ విచారణ న్యాయస్థానం మ్యాచ్‌ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌పై అభియోగాలను కొట్టివేసింది. అయితే ఏ రకమైన క్రికెట్‌ ఆటలోను ఆడకుండా బీసీసీఐ విధించిన నిషేధం మాత్రం ఇంకా కొనసాగుతోంది.

English summary
The BJP Friday fielded former India pacer S Sreesanth from Thiruvananthapuram seat even as it declared 50 other candidates for the Assembly polls in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X