వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ కేంద్ర ఎన్నికల అధికారి టీఎన్ శేషన్ మృతి

|
Google Oneindia TeluguNews

మాజీ కేంద్ర ఎన్నికల అధికారి టీఎన్ శేషన్ (86) చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శేషన్ మృతిని వైద్యుల ధ్రువీకరించారు. ఎన్నికల సంఘం అధికారిగా శేషన్ విధులు నిర్వర్తించి శేషన్ మంచిపేరు తెచ్చుకున్నారు. భారత ఎన్నికల సంఘానికి సరైన గుర్తింపు, గౌరవం తీసుకొచ్చారు. ఆయన మృతిపై పలు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మిన్నంటింది. ఎన్నికల్లో సమర్థంగా విధులు నిర్వర్తించినందుకు గాను ప్రతిష్టాత్మక రామన్ మెగసెస్ అవార్డు కూడా ఆయనను వరించింది.

former election commissioner tn seshan no more

టీఎన్ శేషన్ జననం

టీఎన్ శేషన్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో 1932లో జన్మించారు. 1955లో సివిల్ సర్వీసుల్లో చేరారు. తమిళనాడు ప్రభుత్వంలో పలు శాఖల్లో సెక్రెటరీగా, పలు హోదాల్లోపనిచేశారు. 1997లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కేఆర్ నారాయన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేశారు.

టీఎన్ శేషన్ కెరీర్

టీఎన్ శేషన్ తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1955‌వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. భారత ఎన్నికల కమిషన్ అధికారిగా 1990 నుంచి 1996 వరకు పనిచేశారు. భారత ఎన్నికల కమిషన్‌కు ఆయన 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన హయంలో ఎన్నికలకు సంబంధించిన ఎన్నో సంస్కరణలను ఆయన చేపట్టారు.

ప్రధాని మోదీ సంతాపం..

టీఎన్ శేషన్ మృతితో రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాయి. ప్రధాని మోడీ ట్విట్టర్‌లో తన సంతాప ప్రకటనను తెలియజేశారు. టీఎన్ శేషన్ అత్యంత ప్రతిభగల, అంకిత భావం ఉన్న సివిల్ సర్వెంట్. ఆయన తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. ఆయన ఇక లేరనే వార్తతో నేను తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఓం శాంతి అంటూ మోడీ ట్వీట్ చేశారు.

English summary
former election commissioner tn seshan dead due to illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X