వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లి ఆరోగ్య పరిస్థితి విషమం... ఎయిమ్స్‌కు చేరుకున్న మంత్రులు అమిత్ షా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్సపోందుతున్న మాజీ కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తల నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు ఎయిమ్స్ చేరుకున్నారు. జైట్లీ అరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌లు హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. జైట్లీ అరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు అడిగిని వివారాలు తెలుసుకున్నారు. కాగా అంతకుముందు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సైతం ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Former finance minister Arun Jaitley health was critical,Amit Shah and Harsh Vardhan rushed to the AIIMS

శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందికిగురవుతున్న అరుణ్ జైట్లి ఆగస్టు 9న ఎయిమ్స్‌లో చికిత్స పోందుతున్నారు. కాగా అంతకుముందు కొద్ది నెలలుగా ఆనారోగ్య కారణలతో చికిత్స పోందుతున్నారు. కాగా శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్ వైద్యులు పరిస్థతి బాగానే ఉందని చెప్పారు. ఇక గత వారం నుండి ఎలాంటీ హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఈ దీంతో గతవారమే అరుణ్ జైట్లిని ప్రధాని మోడీతోపాటు పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అరుణ్‌జైట్లి అనారోగ్యం కారణంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయలేదు. కాగా గత ప్రభుత్వంలోనే ఆర్ధికమంత్రిగా ఉన్న జైట్లి అనారోగ్యం కారణంగా పియుష్ గోయల్ కొన్ని రోజులు బాధ్యతలు చేపట్టారు. అనంతరం తిరిగి గత సంవత్సరం ఆగస్టు నుండి మంత్రిత్వ బాధ్యతలు స్వికరించారు.

English summary
Former finance minister Arun Jaitley, who was admitted to AIIMS is critical, home minister Amit Shah and health minister Dr Harsh Vardhan rushed to the hospital late on Friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X