వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఏ పార్టీలో చేరను’: టీఎంసీకి బైచుంగ్ భూటియా రాజీనామా

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: భారత మాజీ ఫుట్‌బాలర్ బైచుంగ్‌ భూటియా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 'ఈరోజు నేను ఆల్‌ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నాను' అని ఆయన ప్రకటించారు.

'అంతేగాక, ఇక మీదట ఏ రాజకీయ పార్టీలోనూ చేరను' అని బైచుంగ్ భూటియా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 1995 నుంచి 2011వరకు జాతీయ ఫుట్‌బాల్‌ భారత టీంతో కలిసి ఆడిన ఆయన 2011లో ఫుట్‌బాల్‌‌ ఆటకు గుడ్‌ బై చెప్పారు.

 Former football captain Bhaichung Bhutia quits Trinamool Congress

2013లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్‌ నుంచి పోటీ చేసి, పరాజయం పొందారు. ఆ తర్వాత నుంచి అంతగా రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనని ఆయన.. తాజాగా టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు.

English summary
Former Indian football captain Bhaichung Bhutia has resigned from all the official and political posts of All India Trinamool Congress (TMC) party. He has also given up the primary membership of the Mamata Banerjee led party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X