వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు ఆ ఐఏఎస్ ను రోశయ్య పరిచయం చేశారంట !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య నుంచి కొన్ని వివరాలు సేకరించడానికి ఐటీ శాఖ అధికారులు సిద్దం అవుతున్నారని సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రభుత్వం మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కేసులో ఐటీ అధికారులు పలు ఆసక్తికర విషయాలు సేకరిస్తున్నారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సీనియర్ ఐఏఎస్ అధికారి పీ. రామ్మోహన్ రావును అప్పటి గవర్నర్ రోశయ్య పరిచయం చేశారని, అందు వలనే ఆయన్ను అమ్మ పర్సనల్ సెక్రటరీ (పీఏ)గా పెట్టుకున్నారని, తరువాత తమిళనాడు సీఎస్ ను చేశారని ఆదాయ పన్ను శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయంపై పూర్తిగా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Former Governor Rosaiah only recommanded Ram Mohana Rao to late CM Jayalalitha !

రామ్మోహన్ రావు అక్రమ ఆస్తుల వివరాలు సేకరిస్తున్నఐటీ అధికారులు అవసరం అయితే తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యను కలుసుకుని రామ్మోహన్ రావు గురించి వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించండం లేదు.

మరో పక్క రామ్మోహన్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు, సన్నిహితుల ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. రామ్మోహన్ రావు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఏమైనా బినామీ ఆస్తులు సంపాదించారా ? అని ఆరా తీస్తున్నారు.

English summary
It is believed that former Governor Rosaiah only recommended Ramamohana Rao to late Chief Minister Jayalalitha. Officials now plan to approach Rosaiah in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X