వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగ్గజ నేత,గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత... ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం...

|
Google Oneindia TeluguNews

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత మాధవసిన్హా సోలంకి(94) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. సిన్హా మృతి పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. 'మాధసిన్హా సోలంకి మరణం కలచివేసింది. గుజరాత్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరిస్తున్న మాధవసిన్హా ఒక బలమైన నాయకుడు. గుజరాత్ సమాజానికి అందించిన సేవల రూపంలో ఆయన గుర్తుంటారు. ఆయన కుమారుడు భారత్ సోలంకితో మాట్లాడి సంతాపం తెలియజేశాను. ఓం శాంతి.' అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Recommended Video

Ahmed Patel : PM Modi, Rahul Pay Tribute కాంగ్రెస్ మూల స్తంభం, ఏఐసీసీకి ఖజానా వంటి నేత అహ్మద్ పటేల్‌

మరో ట్వీట్‌లో.. 'రాజకీయాలు కాకుండా సాంస్కృతిక అంశాలు,పుస్తక పఠనం ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. నేనెప్పుడు ఆయన్ను కలిసిన పుస్తకాల గురించి చర్చించేవాళ్లం. తాను చదివిన కొత్త పుస్తకం గురించి ఆయన చెప్పేవారు.' అని పేర్కొన్నారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చవ్‌దా మాధవసిన్హా మరణంపై విచారణ: వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాధవసిన్హా సేవలు ప్రజల హృదయాల్లో ఆయనకు స్థానం ఏర్పరిచాయని అన్నారు.

Former Gujarat CM Madhavsinh Solanki dies at 94

మాధవసిన్హా సోలంకి గుజరాత్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గానూ సేవలందించారు.నరేంద్ర మోదీ కంటే ముందు గుజరాత్‌కు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్ రాజకీయాల్లో సోలంకి KHAM థియరీ బాగా పాపులర్. 1980ల్లో క్షత్రియ,హరిజన,ఆదివాసీ,ముస్లిం(KHAM) ఫార్ములాతో ఆయన అధికారంలోకి వచ్చారు. 1976లో కొంతకాలం,ఆ తర్వాత 1981,1985లో ఆయన సీఎంగా పనిచేశారు. సోలంకి హయాంలోనే రాష్ట్రంలో సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. 1985లో సోలంకి సారథ్యంలో గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ 182 స్థానాలకు గాను 149 స్థానాలను గెలుచుకోగలిగింది.

English summary
senior Congress leader Madhavsinh Solanki, who served as former Chief Minister of Gujarat and External Affairs Minister from June 1991 to March 1992, passed away on Saturday morning. Madhavsinh Solanki died at the age of 94. He breathed his last at his residence in Gandhinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X