వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాగ్ తదుపరి అధిపతిగా రాజీవ్ మెహరిషి.. ఈరోజే బాధ్యతల స్వీకారం
ఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) తదుపరి అధిపతిగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహరిషి(62) నియమితులుకానున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో శశికాంత్ శర్మ కొనసాగారు.
రాజీవ్ మెహర్షి 1978 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి గత నెలలో పదవీవిరమణ పొందిన ఆయనను ప్రభుత్వం కాగ్ అధిపతిగా ఎంపిక చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు.

సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. రాజీవ్ మెహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం రాజీవ్ మెషరిషి కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్)గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.