వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ అమ్మాయిలు లైంగిక ఉచ్చులోకి: సెంట్రల్ జైల్లో మేడమ్ విచారణ, ఎంత మంది!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాలేజ్ అమ్మాయితో రాసలీలలు, లేడీ ప్రొఫెసర్ అరెస్ట్

మదురై: తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా అరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ అరెస్టు అయిన లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మాజీ ఐఏఎస్ అధికారి సంతానం ఏకసభ్య కమిషన్ విచారణ చేసి వివరాలు సేకరించింది.

మదురై సెంట్రల్ జైలు

మదురై సెంట్రల్ జైలు

మాజీ ఐఏఎస్ అధికారి సంతానం మదురై సెంట్రల్‌జైలుకు వెళ్లి నిర్మలా దేవిని విచారణ జరిపారు. కాలేజ్ అమ్మాయిలను ఎందుకు లైంగిక ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించారు, అమ్మాయిలతో లైంగిక కోరికలు తీర్చుకోవడం కోసం అధికారులు ఎవరెవరు మిమ్మల్ని సంప్రధించారు అని ప్రశ్నించారని తెలిసింది.

కామాంధులు ఎవరు?

కామాంధులు ఎవరు?

మదురై కామరాజర్ యూనివర్శిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ తో పాటు కాలేజ్ అమ్మాయిలను సరఫరా చెయ్యాలని నిర్మలా దేవిని అడిగిన వారి గురించి మాజీ ఐఏఎస్ అధికారి సంతానం పూర్తి వివరాలు అడిగారని తెలిసింది. సంతానంతో పాటు ప్రొఫెసర్లు త్యాగేశ్వరి, కమలి తదితరులు నిర్మలా దేవిని దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించారు.

మేడమ్ స్నేహితురాలు

మేడమ్ స్నేహితురాలు

తూత్తుకూడికి చెందిన మహిళా కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జెసింత తమిళమలర్ కు సీబీసీఐడి అధికారులు సమన్లు జారీ చేశారు. రెండోసారి సమన్లు అందుకున్నఅసిస్టెంట్ ప్రొఫెసర్‌ జెసింత తమిళమలర్ అధికారుల ముందు విచారణకు రెండో సారి హాజరైనారు.

తప్పనిసరి పరిస్థితి

తప్పనిసరి పరిస్థితి

విద్యార్థినులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో తప్పనిసరి పరిస్థితిలో నిర్మలా దేవితో కలిసి మదురైలో ఒకే గదిలో ఉన్నానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని, విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని జెసింత తమిళమలర్ సీబీసీఐడీ అధికారులకు చెప్పారు. అయితే సీబీసీఐడీ అధికారులు సేకరించిన కొన్ని ఆధారాలలో మరోసారి జెసింత తమిళమలర్ ను విచారణ చేశారు.

కామాంధుల విచారణ

కామాంధుల విచారణ

మదురై కామరాజర్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ ను అరెస్టు చేసిన సీబీసీఐడీ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మురుగన్ నోరు విప్పడం లేదని, పెద్దల పేర్లు చెప్పడం లేదని తెలిసింది.

English summary
Former IAS officer Santhanam and a team of CBCID officials are probing Nirmala Devi case. Based on the outcome of the investigation, strict action will be taken against professors and others involved in the scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X