వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఐఎఎస్: దేశం విడిచి వెళ్లబోయారు..పట్టుకొచ్చి కాశ్మీర్ లో వదిలారు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఏ రాజకీయ ప్రత్యర్థి నాయకుడినీ స్వేచ్ఛగా వదిలి పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వం. గడప దాటి బయటికి రాలేని పరిస్థితిని కల్పించింది. భారతీయ జనతాపార్టీయేతర నాయకులను అంత సులువుగా బాహ్య ప్రపంచంలోకి తిరగనివ్వట్లేదు. తాజాగా మరో రాజకీయ నాయకుడిని గృహ నిర్బంధం చేసింది. జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ ఐఎఎస్ అధికారి షా ఫజల్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాయి. సొంత ఇంట్లోనే నిర్బంధించాయి. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం బీజేపీయేతర రాజకీయ నాయకుల గృహ నిర్బంధం కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే.

<strong>అభినందన్.. పాక్ చేతికి చిక్కడానికి వైమానిక దళ తప్పిదాలే కారణమా?</strong>అభినందన్.. పాక్ చేతికి చిక్కడానికి వైమానిక దళ తప్పిదాలే కారణమా?

షా ఫజల్.. ఒకప్పడు ఐఎఎస్ అధికారి. కేంద్ర సర్వీసుల్లో చాలాకాలం పాటు పనిచేశారు. ఆ తరువాత రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశంతో తన హోదాకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ పేరుతో ప్రత్యేక రాజకీయ పార్టీని నెలకొల్పారు. దానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఉదయం ఆయన న్యూఢిల్లీకి చేరుకున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ కు వెళ్లాల్సి ఉంది. దీనికోసం ఆయన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వెంటనే.. ఆయనను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మళ్లీ వెనక్కి పంపించేశాయి. ఆయనను తమ అదుపులోకి తీసుకున్న బలగాలు.. శ్రీనగర్ కు తరలించాయి. ప్రజా భద్రత చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్-పీఎస్ఏ) కింద ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాయి.

Former IAS officer Shah Faesal detained at Delhi airport, placed under house arrest in Kashmir

ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలువురు రాజకీయ నాయకులు గృహ నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు విపక్ష నాయకులు గృహ నిర్బంధంలోనే ఉంటున్నారు. వారిని పరామర్శించడానికి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజకీయ నాయకుడినీ జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టనివ్వలేదు కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ కు వెళ్లడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరీ, డీ రాజాలను శ్రీనగర్ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని, వెనక్కి పంపించిన సందర్భాలు చోటు చేసుకున్నాయి.

English summary
Former IAS officer Shah Faesal was on Wednesday afternoon detained at the Delhi airport after which he was sent back to Kashmir. After he was taken into custody, Shah Faesal was shifted to Srinagar where he was again detained under the Public Safety Act (PSA). Faesal was bound for Istanbul, an official was quoted as saying by news agency Press Trust of India. The ex-IAS officer, who was reportedly stopped from leaving the country, has now been placed under house arrest in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X