వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసీఐసీఐ-వీడియోకాన్ 'మనీ లాండరింగ్' కేసు... చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్....

|
Google Oneindia TeluguNews

వ్యాపారవేత్త,మాజీ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌ను తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్(ED) అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసులో సోమవారం(సెప్టెంబర్ 7) మధ్యాహ్నం నుంచి దీపక్ కొచ్చర్‌ను విచారిస్తున్న పోలీసులు రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్ సంస్థకు రూ.1875 కోట్లు రుణ మంజూరుకు సంబంధించి చందా కొచ్చర్ క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది చందా కొచ్చర్,దీపక్ కొచ్చర్,వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.

రేపు ఢిల్లీ కోర్టు ఎదుట...

రేపు ఢిల్లీ కోర్టు ఎదుట...

దీపక్ కొచ్చర్ విచారణకు సహకరించట్లేదని... మంగళవారం(సెప్టెంబర్ 8) ఆయన్ను ఢిల్లీ కోర్టులో హాజరుపరుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. చందాకొచ్చర్ సీఈవోగా వ్యవహరించిన సమయంలో వీడియోకాన్ సంస్థతో పాటు మరో ఏడు సంస్థలకు మంజూరైన రుణాలపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. ఇందులో గుజరాత్‌కి చెందిన స్టెర్లింగ్ బయోటెక్ ఫార్మా కంపెనీ,భూషణ్ స్టీల్ గ్రూప్ కూడా ఉన్నాయి. ఈ రెండు సంస్థలకు మంజూరైన రుణాలపై కూడా మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఏడు సంస్థలకు కలిపి రూ.7862 కోట్ల రుణాలు అక్రమంగా,నేరపూరితంగా మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి.

2019లో సీబీఐ కేసు నమోదు...

2019లో సీబీఐ కేసు నమోదు...

అవినీతి నిరోధక చట్టం కింద చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లతో పాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌పై జనవరి 22, 2019న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత అదే ఏడాది ఫిబ్రవరిలో ఈ ముగ్గురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో చందా కొచ్చర్‌కి సంబంధించి రూ.78కోట్లు విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో ముంబైలోని ఆమె ఫ్లాట్ సహా దీపక్ కొచ్చర్ వ్యాపార సంస్థలకు చెందిన ఆస్తులున్నాయి.

కొచ్చర్‌పై వేటు... కోర్టులో చుక్కెదురు..

కొచ్చర్‌పై వేటు... కోర్టులో చుక్కెదురు..

రుణాల మంజూరులో అవకతవకలు వెలుగుచూడటంతో ఐసీఐసీఐ చందాకొచ్చర్‌పై ఫిబ్రవరి 2019న వేటు వేసింది. సీఈవో పదవి నుంచి ఆమెను తప్పించింది. అయితే అంతకుముందే తన రిటైర్మెంట్ విజ్ఞప్తికి బ్యాంకు అంగీకరించిందని... ఇంతలోనే తనపై వేటు వేయడమేంటని చందాకొచ్చర్ ఆ నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. అయితే అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది.ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

English summary
Enforcement Directorate (ED) on Monday arrested former ICICI Bank MD and CEO Chanda Kochhar's husband Deepak Kochhar in connection with ICICI Bank-Videocon case, reported news agency ANI citing Enforcement Directorate officials. Earlier this year in January, ED had attached properties of Chanda Kochhar and her family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X