వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఇద్దరు సాయుధ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను పట్టుకున్నారు. అరెస్టయిన టెర్రరిస్టులలో ఒకరైన తాలిబ్ హుస్సేన్, బీజేపీలోకి చొరబడ్డాడని, అంతేగకా, జమ్మూ ప్రావిన్స్‌లోని మైనారిటీ మోర్చా ఐటీ, సోషల్ మీడియా సెల్‌కు ఇన్‌ఛార్జ్‌గా కూడా నియమించబడ్డాడు.

అయితే, తాలిబ్ హుస్సేన్ కేవలం 18 రోజులు మాత్రమే పార్టీ సభ్యుడిగా కొనసాగారని, మే 27, 2022న రాజీనామా చేశారని బీజేపీ పేర్కొంది.

 Former J&K BJP minority morcha IT cell chief among 2 Lashkar terrorists nabbed in Reasi

ఇద్దరు ఉగ్రవాదులు- పుల్వామాకు చెందిన ఫైజల్ అహ్మద్ దార్, రాజౌరీకి చెందిన తాలిబ్ హుస్సేన్- జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని టక్సన్ ధోక్ గ్రామ నివాసితుల సహాయంతో అరెస్టు చేశారు. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే రైఫిళ్లు, ఏడు గ్రెనేడ్లు, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రవాదులను మట్టుబెట్టిన గ్రామస్తులకు డీజీపీ రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను పట్టుకోవడంలో గొప్ప ధైర్యం, సాహసాలను ప్రదర్శించినందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా టక్సన్ ధోక్ గ్రామస్తులకు రూ. 5 లక్షల నగదు రివార్డులను కూడా ప్రకటించారు.

"ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను పట్టుకున్న గ్రామస్థుల ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. అలాంటి సంకల్పం ఉగ్రవాదం అంతం ఎంతో దూరంలో లేదని తెలియజేస్తోంది. యూటీ ప్రభుత్వం గ్రామస్తులకు రూ. 5 లక్షల నగదు బహుమతిని అందజేస్తుంది" అని ఎల్‌జీ సిన్హా అన్నారు.

రాజౌరి పోలీసులు ఇటీవల పెద్ద సంఖ్యలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఇడి)లను స్వాధీనం చేసుకున్నారు. ఒక మాడ్యూల్‌ను ఛేదించారు. ఇందులో ఇద్దరు ఎల్‌ఇటి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. తాలిబ్ హుస్సేన్‌ను పరారీలో ఉన్నట్లు, అతనిపై రివార్డ్ ప్రకటించారు.

English summary
Former J&K BJP minority morcha IT cell chief among 2 Lashkar terrorists nabbed in Reasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X